దక్షిణ కోస్తాకు భారీ వర్ష సూచన

సాక్షి, విశాఖపట్నం: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి తమిళనాడు తీరానికి సమీపంలో కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాగల రెండు రోజులు కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. శని, ఆదివారాల్లో దక్షిణ కోస్తాంధ్రలో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొంది.
దీపావళి తర్వాత చలి తీవ్రత పెరుగుతుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. గడచిన 24 గంటల్లో కావలిలో 7 సెం.మీ., సూళ్లూరుపేటలో 6, ఒంగోలు, తడ, వింజమూరు, శ్రీకాళహస్తి, తొట్టంబేడులో 4, వెంకటగిరి, చీమకుర్తి, సత్యవేడు, పుల్లంపేటలో 3 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి