
సాక్షి, తిరుపతి: తిరుపతిలో భారీ అగ్నిప్రమాద ఘటన వెలుగుచూసింది. గోవిందరాజుస్వామి ఆలయం సమీపంలో గురువారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరిగింది. ఎగిసిపడుతున్న మంటలను చూసి భయంతో భక్తులు పరుగు తీశారు.
వివరాల ప్రకారం.. తిరుపతిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. గోవిందరాజుస్వామి ఆలయం సమీపంలోని ఓ షాపులో మంటలు చెలరేగాయి. దీంతో, ఆలయం ముందు ఉన్న చలువ పందిళ్లకు మంటలు అంటుకున్నాయి. భారీగా ఎగిసి పడుతున్న మంటలను చూసి స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే అప్రమత్తమైన ఫైర్ సిబ్బంది.. అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదం కారణంగా షాపులో ఉన్న ఇత్తడి సామాన్లు, బొమ్మలు దగ్దమయ్యాయి. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
