
సాక్షి, కృష్ణా జిల్లా: మంత్రి నాదెండ్ల మనోహర్‌ను రైతులు నిలదీశారు. గురువారం.. పునాదిపాడులో పర్యటించిన మంత్రి నాదెండ్ల మనోహర్.. రైస్ మిల్లును, కల్లాల్లో ధాన్యాన్ని పరిశీలించారు. ధాన్యం కొనుగోలు చేయడం లేదని మంత్రిని రైతులు నిలదీశారు. కోత కోసి రెండు రోజులైనా ఎవరూ పట్టించుకోవడం లేదన్న రైతులు.. గన్నీ బ్యాగులు ఇవ్వడం లేదంటూ మండిపడ్డారు.

డ్యామేజ్ అయిన (చిల్లులుపడిన) గన్నీ బ్యాగులు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దున్నపోతు ఈనిందా దొడ్లో కట్టేశామా అనేలా అధికారుల తీరు ఉందంటూ రైతులు మండిపడ్డారు. దళారులు, అధికారులు, మిల్లర్లతో కుమ్మక్కైపోయారని రైతులు ఆరోపించారు. బాలాజీ మిల్లు చెబితేనే ధాన్యం కొంటున్నారంటూ రైతులు ఆరోపించారు. రైతుల ప్రశ్నలకు మంత్రి నాదెండ్ల మనోహర్ సమాధానం చెప్పలేకపోయారు.