ఎందుకూ పనికిరాని ప్లాట్లు మాకెందుకిచ్చారు..? | Farmers Confront Officials at Kuragallu CRDA Gram Sabha Guntur | Sakshi
Sakshi News home page

ఎందుకూ పనికిరాని ప్లాట్లు మాకెందుకిచ్చారు..?

May 22 2026 3:31 PM | Updated on May 22 2026 8:53 PM

Farmers Confront Officials at Kuragallu CRDA Gram Sabha Guntur

కూరగల్లు:  పెట్టుబడిదారులకు ఇచ్చే ప్రాధాన్యత భూములిచ్చిన తమకు ఇవ్వడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు ఇచ్చిన ప్లాట్లు అభివృద్ది చేయకుండానే ఇచ్చారని,  లోన్‌ కోసం బ్యాంకులకు వెళ్తే అవి ఎందుకు పనికిరావని వారు తిరస్కరిస్తున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం(మే 22వ తేదీ) గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కూరగల్లులో సీఆర్‌డీఏ గ్రామసభ నిర్వహించారు.  

ఈ గ్రామ సభకు హాజరైన రైతులు.. సీఆర్‌డీఏ అడిషనల్‌ కమిషనర్‌ భార్గవ్‌ను నిలదీశారు. మాకే ఎందుకిలా చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్టుబడిదారులకు ఇచ్చే ప్రాధాన్యత తమకు ఇవ్వడం లేదన్నారు. తమకు డెవలప్‌ చేయని ప్లాట్లు ఇస్తున్నారని, అభివృద్ధి చేసిన ప్లాట్లు ఎందుకు ఇవ్వడం లేదని రైతులు నిలదీశారు. లోన్‌ కోసం బ్యాంకులకు వెళ్తే అవి పనికిరావని చెబుతున్నారని, తమకు అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వాలంటూ డిమాండ్‌ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement