టీడీపీ ఎంపీ కేశినేని చిన్నికి ఈడీ షాక్‌ | ED Notice Given To TDP MP Kesineni Chinni Wife Janaki Laxmi | Sakshi
Sakshi News home page

టీడీపీ ఎంపీ కేశినేని చిన్నికి ఈడీ షాక్‌

May 26 2026 3:43 AM | Updated on May 26 2026 3:43 AM

ED Notice Given To TDP MP Kesineni Chinni Wife Janaki Laxmi

ఫ్రైడ్‌ ఇ్రన్ఫాకాన్‌ ఆర్ధిక అక్రమాలపై గురి ఆ కంపెనీలో డైరెక్టర్‌గా చిన్ని భార్య జానకీ లక్ష్మి

రేపు హైదరాబాద్‌లో విచారణకు హాజరు కావాలని నోటీసులు 

చిన్ని దంపతులు నల్లధనాన్ని భారీగా విదేశాలకు తరలించినట్లు ఆరోపణలు 

లోకేశ్‌కు అత్యంత సన్నిహితుడిగా చక్రం తిప్పుతున్న చిన్ని

సాక్షి, అమరావతి: మంత్రి నారా లోకేశ్‌కు అత్యంత సన్నిహితుడు, విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని శివనాథ్‌(చిన్ని) కుటుంబ ఆర్ధిక అక్రమాల బాగోతం బట్టబయలైంది. షెల్‌ కంపెనీల ముసుగులో అక్రమ నిధులను మళ్లించడంపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) కొరడా ఝళిపించింది. కేశినేని చిన్ని కుటుంబానికి చెందిన ‘ప్రైడ్‌ ఇ్రన్ఫాకాన్‌ ఎల్‌ఎల్‌పీ కంపెనీ’ ముసుగులో అక్రమ నిధులు మళ్లించడంపై విచారణ చేపట్టింది. కంపెనీలో డైరెక్టర్‌గా ఉన్న కేశినేని చిన్ని భార్య జానకీ లక్ష్మికి నోటీసులు జారీ చేసింది.

ఈ నెల 27న హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. దీంతో మంత్రి లోకేశ్‌ క్యాంపుతోపాటు టీడీపీ వర్గాలు ఉలిక్కిపడ్డాయి. కేశినేని చిన్ని షెల్‌ కంపెనీల ముసుగులో ఆర్ధిక అక్రమాలకు పాల్పడినట్లు ఆయన సోదరుడు, మాజీ ఎంపీ కేశినేని నాని గతంలోనే ఈడీకి ఫిర్యాదు చేశారు. ఆమేరకు కీలక ఆధారాలను కూడా సమర్పించారు. ఈ నేపథ్యంలో కేశినేని చిన్ని కుటుంబ కంపెనీల ఆర్ధిక వ్యవహారాలపై ఈడీ విచారణ చేపట్టడం ప్రాధాన్యం 
సంతరించుకుంది.  

అక్రమ నిధుల మళ్లింపు..? 
టీడీపీ ప్రభుత్వం నమోదు చేసిన మద్యం విధానంపై అక్రమ కేసులో నిందితుడిగా ఉన్న రాజ్‌ కేసిరెడ్డికి టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని వ్యాపార భాగస్వామి. రాజ్‌ కేసిరెడ్డికి చెందిన ‘ప్రైడే ఇన్‌ఫ్రాకాన్‌ ఎల్‌ఎల్‌పీ’లో కేశినేని చిన్ని దంపతులు వాటాదారులు. అంతేకాదు.. అక్రమ నిధులు తరలించారని సిట్‌ అధికారులు చెబుతున్న ఇషన్వీ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, ప్రైడే ఇన్‌ఫ్రా కాన్‌ ఎల్‌ఎల్‌పీ.. హైదరాబాద్‌లోని ఒకే చిరునామాతో (జూబ్లీ హిల్స్, సర్వేనంబర్‌ 403, ప్లాట్‌ నంబర్‌ 9 )తో రిజిస్టర్‌ అయ్యాయి. ఆ రెండు కంపెనీలు ఒకే మెయిల్‌ ఐడీ ( accounts@wshanviinfraprojects.com)నే ఉపయోగిస్తుండటం గమనార్హం.

 కేశినేని చిన్ని హైదరాబాద్‌లో రియల్‌ ఎస్టేట్, విదేశీ కంపెనీల ద్వారా భారీగా నల్లధనాన్ని విదేశాలకు తరలించి భారీ పెట్టుబడులు పెట్టారని కేశినేని నాని ఆరోపించారు. కేశినేని ఇంటర్నేషనల్‌ లిమిటెడ్, డెలావేర్, యూఎస్‌ఏ కేశినేని గ్లోబల్‌ ఎంటర్‌ప్రైజస్‌ కంపెనీలు దుబాయ్, అమెరికాలో అక్రమంగా పెట్టుబడులు పెట్టినట్లు వెల్లడించారు. ఈ కంపెనీలు భారీగా నిధులను అక్రమంగా తరలించి మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు తెలిపారు. రాజ్‌ కేసిరెడ్డి, ఆయన సహచరుడు దిలీప్‌ కంపెనీల్లో ఎంపీ కేశినేని చిన్ని, ఆయన భార్య జానకీ లక్ష్మి భాగస్వామిగా ఉన్నారు. రియల్‌ ఎస్టేట్, హవాలా, మూడో పార్టీ ఒప్పందాల పేరుతో భారీగా అక్రమ నిధులు విదేశాలకు తరలించారు.

లోకేశ్‌ క్యాంపులో గుబులు 
టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని కుటుంబానికి ఈడీ నోటీసులు జారీ చేయడం మంత్రి లోకేశ్‌ క్యాంప్‌లో గుబులు రేపుతోంది. లోకేశ్‌కు బినామీగా ఎంపీ కేశినేని చిన్ని వ్యవహరిస్తున్నారని టీడీపీ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. అందుకే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌(ఏసీఏ) పగ్గాలు ఆయనకు అప్పగించారు. కేశినేని చిన్ని బినామీ కంపెనీగా పేరుపడిన ‘ఉర్సా క్లస్టర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ అనే ఊరూ పేరూలేని కంపెనీకి విశాఖపట్నంలో అత్యంత విలువైన 60 ఎకరాల భూమిని కారు చౌకగా కట్టబెడుతూ కేబినెట్‌ ఆమోదించింది. ఎన్టీఆర్‌ జిల్లాకు సంబంధించి లోకేశ్‌ ప్రతినిధిగా చిన్ని చక్రం తిప్పుతున్నారు. లోకేశ్, కేశినేని చిన్ని ప్రత్యేక విమానాల్లో విదేశీ పర్యటనల వెనుక లోగుట్టు ఏమిటన్నది ప్రభుత్వ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కేశినేని చిన్ని కంపెనీకి ఈడీ నోటీసులు జారీ చేయడంతో తదుపరి పరిణామాలపై చినబాబు క్యాంప్‌ మల్లగుల్లాలు పడుతోంది.  

ఈడీ విచారణకు సహకరిస్తాం: కేశినేని చిన్ని, టీడీపీ ఎంపీ 
తమ కుటుంబానికి చెందిన ప్రైడ్‌ ఇన్ఫ్రా కంపెనీకి ఈడీ నోటీసులు జారీ చేసిందని టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని వెల్లడించారు. తన భార్య జానకీ  ఆ కంపెనీలో డైరెక్టర్‌గా ఉన్నారని ఆయన విజయవాడలో మీడియా ప్రతినిధులతో పేర్కొన్నారు. ఈడీ నోటీసుల మేరకు ఈ నెల 27న విచారణకు హాజరవుతామని, విచారణకు 
సహకరిస్తామని చెప్పారు.  

కేశినేని చిన్ని విదేశాలకు అక్రమంగా నిధులు తరలించేందుకు ఉపయోగించిన కంపెనీలు ఇవీ.... 
కేశినేని ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌(అమెరికా) 
కేశినేని గ్లోబల్‌ ఎంటర్‌ప్రైజస్‌ (దుబాయ్‌) 
కేశినేని డెవలపర్స్‌ ప్రై.లిమిటెడ్‌ 
కేశినేని ఇన్‌ఫ్రా డెవలపర్స్‌ ఎల్‌ఎల్‌పీ 

⇒  పీవీఆర్‌ సన్నీ రిడ్జ్‌ హోమ్స్‌ ఎల్‌ఎల్‌పీ 
గ్రాండ్‌ ప్రాజెక్ట్‌ ఎల్‌ఎల్‌పీ 
 ఓబికే ఇన్‌ఫ్రా హైట్స్‌ ఎల్‌ఎల్‌పీ 
 ఓక్‌వుడ్‌ ప్రాజెక్ట్స్‌ ఎల్‌ఎల్‌పీ 

సెరెనిటీ వెంచర్స్‌ ఎల్‌ఎల్‌పీ 
 కేపిటల్‌ సిరామిక్స్‌ ఎల్‌ఎల్‌పీ 
పయనీర్‌ లైఫ్‌ స్పేసస్‌ ఎల్‌ఎల్‌పీ 
ఇఫైసెన్స్‌ ఇన్‌ఫ్రా ప్రై.లిమిటెడ్‌   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement