Covid - 19, Andhra Pradesh Doctor Dies Of Coronavirus In West Godavari District - Sakshi
Sakshi News home page

కరోనాతో వైద్య విద్యార్థిని రోజీ మృతి

Jun 2 2021 1:20 PM | Updated on Jun 2 2021 5:02 PM

Doctor Died with Covid In West Godavari - Sakshi

ఏలూరు టౌన్‌(పశ్చిమ గోదావరి): మెడిసిన్‌ ఫస్ట్‌క్లాస్‌లో పాస్‌ అయ్యింది. కరోనా రోగులకు వైద్యసేవలందిస్తూ.. ఆ వైరస్‌ బారినపడి అసువులుబాసింది. తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం మోరి గ్రామానికి చెందిన కందికట్ల రోజీ ఏలూరులోని ఆశ్రం వైద్య కళాశాలలో ఎంబీబీఎస్‌ పూర్తి చేసింది. ఆశ్రంలోనే శిక్షణ పొందుతోంది. కరోనా సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో ఏలూరు ఆశ్రం కోవిడ్‌ హాస్పిటల్‌లో కరోనా రోగులకు సేవలందించింది.

రోగులకు చికిత్స చేసే క్రమంలో అనారోగ్యానికి గురవడంతో స్వగ్రామం మోరి చేరుకుంది. సోమవారం మోరి గ్రామంలోని సుబ్బమ్మ కోవిడ్‌ స్టెబిలైజేషన్‌ సెంటర్‌లో వైద్య చికిత్స కోసం చేరింది. పరిస్థితి విషమించడంతో మంగళవారం మృతిచెందింది. ఆమె మృతితో తల్లితండ్రులు, బంధువులు దుఃఖసాగరంలో మునిగిపోయారు.  

చదవండి: కోవిడ్‌ బెడ్‌పై నుంచే శశి థరూర్‌ సందేశం: వీడియో వైరల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement