రేపటి నుంచి ధనుర్మాసం

Devotion Month Dhanurmasam Starts From 16 December 2020 - Sakshi

సాక్షి, తిరుమల: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి మాసోత్సవాల్లో అత్యంత ముఖ్యమైనదిగా భావించే ధనుర్మాసం ఈనెల 16న ప్రారంభం కానుంది. ఆరోజు ఉదయం 6.04 గంటలకు ధనుర్మాస ఘడియలు ప్రారంభం కానున్న నేపథ్యంలో డిసెంబర్‌ 17వ తేదీ నుంచి స్వామివారికి నిర్వహించే సుప్రభాత సేవ స్థానంలో తిరుప్పావై నివేదిస్తారు. కాగా, ధనుర్మాస ఘడియలు 2021 జనవరి 14న ముగియనున్నాయి. శ్రీవారిని దర్శించుకున్న వ్యాసరాజ మఠాధిపతి కర్ణాటకలోని ప్రముఖ ద్వైత సంస్థానం వ్యాసరాజ మఠాధిపతి విద్యా శ్రీశ తీర్థ స్వామి సోమవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమల చేరుకున్న ఆయనకు టీటీడీ అర్చకులు, ఈవో కేఎస్‌ జవహర్‌రెడ్డి, అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి ఇస్తికఫాల్‌ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

సత్యదేవుడి కార్తీక  ఆదాయం రూ. పది కోట్లు 
అన్నవరం:  తూర్పు గోదావరి జిల్లా అన్నవరం శ్రీ వీరవేంకట సత్యన్నారాయణ స్వామి దేవస్థానానికి కార్తికమాసం సిరులు కురిపించింది.  భారీగా తరలివచ్చిన భక్తులు హుండీలలో సమరి్పంచిన కానుకలను సోమవారం లెక్కించారు. 1,85,71,847 ఆదాయం వచి్చంది. 33 గ్రాముల బంగారం, 630 గ్రాముల వెండి కూడా లభించిందని దేవస్థానం చైర్మన్‌ ఐవీ రోహిత్, ఈఓ వి.త్రినాధరావు తెలిపారు. ఇది 32 రోజుల హుండీ ఆదాయం కాగా..అందులో 29 రోజులు కార్తీకమాసమని వివరించారు. ఒకేసారి హుండీ లెక్కింపులో ఇంత పెద్ద మొత్తంలో ఆదాయం రావడం ఇదే ప్రథమమని చెప్పారు. దేవస్థానంలోని వివిధ విభాగాల ద్వారా ఇప్పటికే సుమారు రూ. 8 కోట్లు పైబడి ఆదాయం వచి్చందని, ప్రస్తుత హుండీ ఆదాయం రూ.1.85 కోట్లు కలిపితే ఆదాయం సుమారు రూ. పది కోట్ల వరకు  వచి్చందని అధికారులు తెలిపారు.

భక్తుల ఇంటికే అయ్యప్ప ప్రసాదం
హైదరాబాద్‌: కోవిడ్‌–19 నిబంధనల కారణంగా ఈసారి శబరిమలకు వెళ్లలేని భక్తుల కోసం ట్రావెన్‌కోర్‌ దేవస్థానం తపాలా శాఖ సహకారంతో భక్తుల ఇంటికే అయ్యప్ప స్వామి ప్రసాదం పంపించేలా కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. భక్తులు తమకు సమీపంలోని తపాలా శాఖ కార్యాలయాల్లో రూ.450 చెల్లిస్తే చాలు.. పది రోజుల్లో అయ్యప్ప ప్రసాదంతో కూడిన కిట్‌ స్పీడ్‌పోస్ట్‌ ద్వారా కోరుకున్న అడ్రస్‌కు చేరుతుంది. ప్రసాదం కిట్‌లో అరవన్న పాయసంతో పాటు స్వామివారి అభిషేకం నెయ్యి, పసుపు, కుంకుమ, విబూది, అష్టోత్తర అర్చన ప్రసాదం ఉంటాయి. పది రోజుల్లో కిట్‌ ఇంటికి చేరుతుంది. అయ్యప్ప స్వామి జ్యోతి దర్శనం జరిగే మకరసంక్రాంతి వరకు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top