breaking news
shabarimali
-
రేపటి నుంచి ధనుర్మాసం
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి మాసోత్సవాల్లో అత్యంత ముఖ్యమైనదిగా భావించే ధనుర్మాసం ఈనెల 16న ప్రారంభం కానుంది. ఆరోజు ఉదయం 6.04 గంటలకు ధనుర్మాస ఘడియలు ప్రారంభం కానున్న నేపథ్యంలో డిసెంబర్ 17వ తేదీ నుంచి స్వామివారికి నిర్వహించే సుప్రభాత సేవ స్థానంలో తిరుప్పావై నివేదిస్తారు. కాగా, ధనుర్మాస ఘడియలు 2021 జనవరి 14న ముగియనున్నాయి. శ్రీవారిని దర్శించుకున్న వ్యాసరాజ మఠాధిపతి కర్ణాటకలోని ప్రముఖ ద్వైత సంస్థానం వ్యాసరాజ మఠాధిపతి విద్యా శ్రీశ తీర్థ స్వామి సోమవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమల చేరుకున్న ఆయనకు టీటీడీ అర్చకులు, ఈవో కేఎస్ జవహర్‌రెడ్డి, అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి ఇస్తికఫాల్ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. సత్యదేవుడి కార్తీక ఆదాయం రూ. పది కోట్లు అన్నవరం: తూర్పు గోదావరి జిల్లా అన్నవరం శ్రీ వీరవేంకట సత్యన్నారాయణ స్వామి దేవస్థానానికి కార్తికమాసం సిరులు కురిపించింది. భారీగా తరలివచ్చిన భక్తులు హుండీలలో సమరి్పంచిన కానుకలను సోమవారం లెక్కించారు. 1,85,71,847 ఆదాయం వచి్చంది. 33 గ్రాముల బంగారం, 630 గ్రాముల వెండి కూడా లభించిందని దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వి.త్రినాధరావు తెలిపారు. ఇది 32 రోజుల హుండీ ఆదాయం కాగా..అందులో 29 రోజులు కార్తీకమాసమని వివరించారు. ఒకేసారి హుండీ లెక్కింపులో ఇంత పెద్ద మొత్తంలో ఆదాయం రావడం ఇదే ప్రథమమని చెప్పారు. దేవస్థానంలోని వివిధ విభాగాల ద్వారా ఇప్పటికే సుమారు రూ. 8 కోట్లు పైబడి ఆదాయం వచి్చందని, ప్రస్తుత హుండీ ఆదాయం రూ.1.85 కోట్లు కలిపితే ఆదాయం సుమారు రూ. పది కోట్ల వరకు వచి్చందని అధికారులు తెలిపారు. భక్తుల ఇంటికే అయ్యప్ప ప్రసాదం హైదరాబాద్: కోవిడ్–19 నిబంధనల కారణంగా ఈసారి శబరిమలకు వెళ్లలేని భక్తుల కోసం ట్రావెన్కోర్ దేవస్థానం తపాలా శాఖ సహకారంతో భక్తుల ఇంటికే అయ్యప్ప స్వామి ప్రసాదం పంపించేలా కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. భక్తులు తమకు సమీపంలోని తపాలా శాఖ కార్యాలయాల్లో రూ.450 చెల్లిస్తే చాలు.. పది రోజుల్లో అయ్యప్ప ప్రసాదంతో కూడిన కిట్ స్పీడ్‌పోస్ట్ ద్వారా కోరుకున్న అడ్రస్‌కు చేరుతుంది. ప్రసాదం కిట్‌లో అరవన్న పాయసంతో పాటు స్వామివారి అభిషేకం నెయ్యి, పసుపు, కుంకుమ, విబూది, అష్టోత్తర అర్చన ప్రసాదం ఉంటాయి. పది రోజుల్లో కిట్ ఇంటికి చేరుతుంది. అయ్యప్ప స్వామి జ్యోతి దర్శనం జరిగే మకరసంక్రాంతి వరకు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు -
సింగర్ బాలుకు కేరళ సత్కారం
శబరిమలై: గాన గాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కీర్తికి మరో కలికితురాయి తోడైంది. కేరళ ప్రభుత్వం, శబరిమలై దేవస్థానం ఉమ్మడిగా అందించే ప్రతిష్ఠాత్మక 'హరివరాసనం' అవార్డును ఈ ఏడాదికిగానూ ఆయన అందుకున్నారు. శనివారం అయ్యప్ప సన్నిధానం శబరిమలై ఆలయంలో కేరళ దేవాదాయ శాఖ మంత్రి వీఎస్ శివకుమార్ నుంచి బాలు ఈ అవార్డును స్వీకరించారు. అవార్డుతోపాటు లక్ష రూపాయల నగదు బహుమానం, మెమొంటోను అందజేశారు. తన గానం ద్వారా ఆథ్యాత్మిక ఉన్నతికి పాటుపడినందుకుగానూ ఆయనను హరివరాసనం అవార్డుకు ఎంపిక చేసినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. 'ఐదు దశాబ్ధాల నా సంగీత ప్రస్థానంలో ఎన్నో అవార్డులను అందుకున్నాను. అయితే హరివరాసం మాత్రం వాటన్నింటిలోకి ప్రధానమైనదిగా భావిస్తున్నాను. అయ్యప్ప స్వామి ఆలయం మత సామరస్యానికి గొప్ప ఉదాహరణ. స్వామివారిని కీర్తిస్తూ హిందీ సహా అనేక భాషల్లో పాటలు పాడిన నేను మొదటిసారి శబరిమలకు రావడం ఆనందంగా ఉంది' అని అన్నారు.