YS Jagan: ప్రజల ఆకాంక్ష ఒక్కటే..! | On This Day In 2019, YS Jagan Mohan Reddy Sworn In As AP CM, The Beginning Of New Era In AP, Read Story Inside | Sakshi
Sakshi News home page

YS Jagan Ane Nenu: ప్రజల ఆకాంక్ష ఒక్కటే..!

May 30 2026 10:15 AM | Updated on May 30 2026 11:08 AM

On This Day in 2019: YS Jagan Mohan Reddy Sworn In As AP CM

నేడు.. సరికొత్త పరిపాలనకు శ్రీకారం చుట్టిన రోజు
నేడు.. అవధి లేని సంక్షేమానికి నాంది పడిన రోజు
నేడు.. అభివృద్ధికి కొత్త అర్థం చెప్పిన రోజు
నేడు.. సీఎంగా జగన్‌ ప్రమాణ  స్వీకారం చేసిన రోజు 

‘వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అనే నేను’ అంటూ సరిగ్గా ఇదే రోజు జననేత జగన్‌ చేసిన ప్రమాణం.. నవ్యాంధ్ర ప్రదేశ్‌ చరిత్రలో నవశకాన్ని లిఖించింది. ఆ శుభదినాన రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆయన.. రాష్ట్ర చరిత్రలోనే మునుపెన్నడూ చూడని రీతిలో సంక్షేమాన్ని, అభివృద్ధిని అందించారు. పరిపాలనను కొత్త పుంతలు తొక్కించారు. ప్రజల ముంగిటకు చేర్చి, దేశానికే ఆదర్శంగా నిలిపారు. అవ్వాతాతలకు బిడ్డలా.. అక్కచెల్లెమ్మలకు సోదరుడిలా.. పిల్లలకు మేనమామలా.. కనీవినీ ఎరుగని సంక్షేమ పథకాలతో భరోసానిచ్చారు. ఇంటివద్దకే పింఛన్లు, రేషన్‌ సరకులు.. అమ్మ ఒడి.. విద్యా కానుక, విద్యా దీవెన, వసతి దీవెన.. రైతు భరోసా వంటి వినూత్న పథకాలతో పేదలకు చేయూతనిచ్చారు. ఆరోగ్యశ్రీ, కంటివెలుగు వంటి పథకాలతో ప్రజల ఆరోగ్యానికి అండగా నిలిచారు. తమ జీవితాలను మలుపు తిప్పిన ఆ రోజును ప్రజలు ఇప్పటికీ గుర్తు పెట్టుకుంటున్నారు.

YS Jagan Mohan Reddy swearing-in ceremony Photo Gallery - Sakshi1

సాక్షి ప్రతినిధి, కాకినాడ: ప్రజల కష్టాలను ప్రత్యక్షంగా తెలుసుకుని.. అధికారంలోకి వచ్చిన తరువాత వారి బతుకుల్ని ఏవిధంగా బాగు చేయాలో తెలుసుకునేందుకు.. 3,648 కిలోమీటర్ల మేర ప్రజాసంకల్ప యాత్ర చేసి.. వారి ఆశలు, ఆకాంక్షలకు ప్రతీకగా.. వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సరిగ్గా ఏడేళ్ల క్రితం ఇదే రోజున.. అంటే 2019 మే 30న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తన తండ్రి, మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి అడుగుజాడల్లో సంక్షేమాన్ని, అభివృద్ధిని సమాంతరంగా పరుగులు పెట్టించారు. కోవిడ్‌ వంటి మహావిపత్తు ముంచుకొచ్చినా.. తన ఐదేళ్ల పాలనలో ఇచ్చిన మాటకు కట్టుబడి పేదల సంక్షేమానికి ఎక్కడా లోటు లేకుండా చూశారు.

కారణాలేవైనా.. గత ఎన్నికల్లో కూటమి అధికారంలోకి రావడంతో.. అప్పటి వరకు జగన్‌ అందించిన సంక్షేమ పాలనకు దూరమయ్యామనే ఆవేదన రెండేళ్లుగా జనానికి తప్పడం లేదు. ఇచ్చిన హామీలు అమలు చేయని చంద్రబాబు ప్రభుత్వంపై విసిగి వేసారుతున్న ప్రజలు మళ్లీ వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి రావాలని, ‘జగన్‌ అనే నేను’ మాటను మరోసారి వినాలని బలంగా ఆకాంక్షిస్తున్నారు. జగన్‌ ఐదేళ్ల పాలనలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కొత్త పుంతలు తొక్కిందనడం అతిశయోక్తి ఎంతమాత్రం కాదు. 

YS Jagan Mohan Reddy swearing-in ceremony Photo Gallery - Sakshi3

సంక్షేమ సిరులు 
 అప్పటి వరకూ రూ.2 వేలుగా ఉన్న సామాజిక భద్రతా పింఛన్‌ను ఇచ్చిన మాట మేరకు రూ.2.250కి పెంచుతూ నాడు జగన్‌ తొలి సంతకం చేశారు. ఆ తరువాత ఏటా రూ.250 చొప్పున పెంచుతూ చివరి సంవత్సరానికి పింఛను మొత్తాన్ని రూ.3 వేలు చేశారు. 2019 మే 30 నాటికి ఉమ్మడి జిల్లాలో 5,81,827 మంది వివిధ రకాల సామాజిక పింఛన్లు పొందుతున్నారు. జగన్‌ పాలనలో అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు మంజూరు చేయడంతో ఉమ్మడి జిల్లాలో మరింత మందికి లబ్ధి చేకూరింది. 

  •  2019కి ముందు టీడీపీ పాలనలో రేషన్‌ కార్డు కోసం అర్హులైన వారు నెలల తరబడి వేచి చూడాల్సి వచ్చేది. జగన్‌ పాలనలో అరగంటలోనే రేషన్‌ కార్డు మంజూరు చేసి అందించడం ఓ సెన్సేషన్‌. 

  • ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత పరిపుష్టం చేసి, ఈ పథకం పరిమితిని తొలుత రూ.5 లక్షలకు, ఆపై ఏకంగా రూ.25 లక్షలకు పెంచడం ద్వారా పేదల ఆరోగ్యానికి భరోసా కలి్పంచారు. అంతేకాదు.. ఏకంగా 3,200కు పైగా ప్రొసీజర్లను ఈ పథకం పరిధిలోకి తీసుకొచ్చారు. 
     వైఎస్సార్‌ కంటి వెలుగు పథకం ద్వారా పాఠశాల విద్యార్థులకు, అవ్వాతాతలకు కంటి పరీక్షలు, కళ్లజోళ్లు, అవసరమైన వారికి శస్త్రచికిత్సలు ఉచితంగా అందించారు. 

  •  వైఎస్సార్‌ మత్స్యకార భరోసా కింద వేట నిషేధ భృతిని రూ.10 వేలకు పెంచే కార్యక్రమానికి ఉమ్మడి జిల్లా నుంచే ఆయన శ్రీకారం చుట్టారు. 

  • జగనన్న అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన పథకాల కింద ఉమ్మడి జిల్లాలోని లక్షలాది మంది విద్యార్థుల తల్లులకు ఏటా క్రమం తప్పకుండా ఆర్థిక సాయం అందించారు. జగనన్న విద్యా కానుక, గోరుముద్ద వంటి వినూత్న పథకాలు అమలు చేశారు. ప్రభుత్వ బడుల్లో ట్యాబులు, డిజిటల్‌ విద్యా బోధన, ఆంగ్ల మాధ్యమం వంటి వాటికి శ్రీకారం చుట్టారు. 

  •  వైఎస్సార్‌ ఆసరా, చేయూత, డ్వాక్రా మహిళల రుణమాఫీ (ఆసరా), 45–60 ఏళ్ల లోపు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళల స్వయం ఉపాధికి ఏటా ఆర్థిక సాయం అందించారు. ఓసీ మహిళలకు కూడా దీనిని వర్తింపజేశారు. 

  • వైఎస్సార్‌ రైతు భరోసా పథకం కింద అన్నదాతలకు ఏటా రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయం క్రమం తప్పకుండా అందించారు. అంతేకాదు.. ప్రకృతి విపత్తులు సంభవించి, పంట నష్టం వాటిల్లితే సీజన్‌ దాటకుండానే పరిహారం అందించడం ఓ రికార్డు. 

  • పేదల సొంతింటి కలను నిజం చేసేలా అక్కచెల్లెమ్మల పేరిట వేలాది మందికి ఇళ్ల స్థలాలు అందించడమే కాదు.. ఇళ్ల నిర్మాణానికి సైతం సాయం అందించారు. జగనన్న కాలనీల పేరిట ఏకంగా ఊళ్లే నిర్మించారు. 

  • YS Jagan Mohan Reddy swearing-in ceremony Photo Gallery - Sakshi18

    ప్రజల వద్దకే పాలన 
    ఉమ్మడి జిల్లాలో 2019 నాటికి 779 క్లస్టర్ల పరిధిలో 1,072 గ్రామ పంచాయతీలుండేవి. కానీ, 539 క్లస్టర్లకు మాత్రమే కార్యదర్శులుండేవారు. 230 క్లస్టర్ల పరిధిలో కార్యదర్శుల కొరత ఉండటంతో ఆ ప్రభావం ప్రభుత్వ సేవలపై పడి ప్రజలు తీవ్ర అవస్థలు పడేవారు. జగన్‌ అధికారంలోకి వచ్చాక పరిపాలనను ప్రజల చెంతకే చేర్చేలా గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థకు 2019 అక్టోబర్‌ 2న కాకినాడ జిల్లా కరపలో శ్రీకారం చుట్టారు. ప్రతి సచివాలయంలోను దాదాపు అన్ని ప్రభుత్వ శాఖలకు ప్రతినిధులుగా 11 మంది ఉద్యోగులను నియమించి, దేశ విదేశాలకు సైతం ఆదర్శంగా నిలిచే విప్లవాత్మకమైన పరిపాలనా సంస్కరణలకు నాంది పలికారు. అంతే కాదు.. ప్రతి 50 ఇళ్లకు ఒక గ్రామ వలంటీర్‌ను ప్రజల ఆమోదంతో నియమించి, సచివాలయ వ్యస్థకు అనుసంధానం చేశారు. దీంతో, ప్రజలకు 500కు పైగా ప్రభుత్వ సేవలు వారి ముంగిటనే ఎటువంటి మధ్యవర్తుల ప్రమేయం లేకుండా సులభంగా అందేవి. పాలనా వికేంద్రీకరణలో భాగంగా ఇచ్చిన మాటకు కట్టుబడి, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాను కాకినాడ, తూర్పు గోదావరి, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమగా పునర్వ్యవస్థీకరించారు.

  • అభివృద్ధి మెరుపులు
     ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌కు దీటుగా తీర్చిదిద్దే లక్ష్యంతో మన బడి నాడు–నేడు పథకానికి జగన్‌ శ్రీకారం చుట్టారు. మొదటి విడత ఆధునీకరించిన పాఠశాలలను ఉమ్మడి జిల్లాలో పి.గన్నవరం మండలం పోతవరం జెడ్పీ హైసూ్కల్‌లో విద్యార్థులకు అంకితం చేసి, రెండో విడత కార్యక్రమాన్ని ప్రారంభించారు. 

  • పేదల పిల్లలు సైతం డాక్టర్లు కావాలనే ఆకాంక్షతో రాజమహేంద్రవరం, అమలాపురాల్లో ప్రభుత్వ వైద్య కళాశాలలకు శ్రీకారం చుట్టారు. రాజమహేంద్రవరం కళాశాలలో ఇప్పటికే బోధన ప్రారంభమైంది. ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటు పరం చేసేందుకు ప్రయతి్నస్తోంది. 

  • పారిశ్రామికాభివృద్ధిలో భాగంగా నల్లజర్ల మండలంలో రూ.250 కోట్లతో ఆయిల్‌పామ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌కు శ్రీకారం చుట్టారు. తద్వారా 25 వేల హెక్టార్లలో ఆయిల్‌పామ్‌ సాగు చేసే రైతులకు లబ్ధి చేకూరడంతో పాటు 1,500 మందికి ఉపాధి అవకాశాలు కలి్పంచారు.  

  • గోకవరం మండలం గుమ్మళ్లదొడ్డిలో రూ.270 కోట్లతో అస్సాగో బయో–ఇథనాల్‌ ప్లాంట్‌ నిర్మాణానికి 2022 నవంబర్‌లో జగన్‌ భూమిపూజ చేశారు. 

  • తొండంగి మండలంలో కాకినాడ గేట్‌వే పోర్టు నిర్మాణం జరగడానికి నాడు జగన్‌ దార్శనికతే కారణమని చెప్పాలి. 

  • మత్స్యకారుల కోసం సుమారు రూ.230 కోట్లతో ఉప్పాడలో ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణానికి జగన్‌ శ్రీకారం చుట్టారు.

 

Advertisement
 
Advertisement
Advertisement