
ఇప్పటికే రూ.220.74 కోట్ల చెల్లింపునకు సీఆర్‌డీఏ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆమోదం
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో మళ్లీ కన్సల్టెన్సీల రాజ్యం సాగుతోంది. సీఆర్‌డీఏలో ప్రతి ప్రాజెక్టుకూ కన్సల్టెన్సీలను నియమిస్తున్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం వందల కోట్ల రూపాయలను వెచి్చస్తోంది. ఇప్పటి వరకు రాజధాని ప్రాజెక్టుల పేరుతో కన్సల్టెన్సీలకు ఏకంగా రూ.220.74 కోట్లు చెల్లించేందుకు సీఆర్‌డీఏ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆమోదం తెలిపింది. జోన్ 2, 4, 6, 10ల్లో చేపట్టిన పనుల పర్యవేక్షణకు ప్రాజెక్టు మేనేజ్‌మెంట్ కన్సల్టెన్సీని ఆర్వీ అసోసియేట్స్ ఆర్కిటెక్టస్ ఇంజినీర్స్ అండ్ కన్సల్టెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు రూ.49.95 కోట్లకు అప్పగిస్తూ సీఆర్‌డీఏ ఆమోదం తెలిపింది.
జోన్ 12, 12ఏలో చేపట్టే మౌలిక వసతుల ప్రాజెక్టు పనుల పర్యవేక్షణకు ప్రాజెక్టు మేనేజ్‌మెంట్ కన్సల్టెన్సీ బాధ్యతలను నిప్పాన్ కోయి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రూ.40.44 కోట్లకు అప్పగించింది. అమరావతి రాజధాని ఆర్థికాభివృద్ధిలో ప్రైవేట్ రంగ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి వ్యూహాత్మక నిర్వహణ కన్సల్టెంట్‌ను సీఆర్‌డీఏ నియమించింది. ఈ బాధ్యతను ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు రూ.11.44 కోట్లకు సీఆర్‌డీఏ అప్పగించింది.
జోన్ 1, 7లో చేపట్టే మౌలిక ప్రాజెక్టు పనులు పర్యవేక్షణ బాధ్యతను నిప్సాన్ కోయి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు రూ.26.85 కోట్లకు అప్పగిస్తూ ఆమోదం తెలిపింది. జోన్ 5లో చేపట్టే మౌలిక సదుపాయాల ప్రాజెక్టు పనులు పర్యవేక్షణను రూ.23.89 కోట్లకు అప్పగించింది. జోన్ 9లో చేపట్టే మౌలిక సదుపాయాల ప్రాజెక్టు పనులను యుఎస్‌ఐ అండ్ ఇన్‌ఫ్రాకు రూ.20.93 కోట్లకు అప్పగిస్తూ సీఆర్‌డీఏ ఆమోదం తెలిపింది. అసెంబ్లీ, హైకోర్టు ప్రాజెక్టు పనులు పర్యవేక్షణను టీయూవీ ఇండియా లిమిటెడ్‌కు రూ.22.25 కోట్లకు అప్పగించ