‘కోవిడ్ నియమాలతో పరీక్షలు నిర్వహిస్తున్నాం’

Collector Veerapandian: We Are Conducting Exams With Covid Rules - Sakshi

సాక్షి, కర్నూలు : రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో 1276 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసినట్లు కలెక్టర్‌ వీరపాండియన్ తెలిపారు. ఈ నెల 20వ తేదీ నుంచి 26వ తేదీ వరకు గ్రామ, వార్డు సచివాలయం పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. జిల్లాలోని 1276 పోస్టులకు గాను, 85,910 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారని, జిల్లాలో 127 పరీక్ష కేంద్రాల ఏర్పాటు, ఆరు క్లస్టర్స్‌​ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. పరీక్ష కోసం వచ్చే అభ్యర్థులకు ఉచితంగా బస్సు ప్రయాణం చేయవచ్చని, 320 మంది పోలీస్ భద్రతతో పరీక్షలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. (సీఎం జగన్‌ ఆ మాటే నా 'ఇకిగయ్'.)

దీనిపై జిల్లా అధికారులు, మంత్రులతో సమీక్ష నిర్వహించినట్లు కలెక్టర్‌ తెలిపారు. ‘తప్పనిసరిగా పరీక్ష కేంద్రానికి గంట ముందే చేరుకోవాలి. ఖచ్చితంగా మాస్కు ధరించాలి. కోవిడ్ నియమాలతో పరీక్ష నిర్వహిస్తున్నాం. ఇందుకు హల్ టికెట్‌లోనే కరోనా వైరస్‌తో వ్యక్తి గత భద్రత గురించి పోందుపరిచాం. కరోనా లక్షణాలు కనిపించిన వారికి పరీక్ష కేంద్రంలో ప్రత్యేక ఐసోలేషన్ హల్‌ను ఏర్పాటు చేశాం. పరీక్ష రాయనిస్తాం’ అని తెలిపారు. కాగా మూడు అంచల భద్రతతో గ్రామ, వార్డు సచివాలయం పరీక్షలు నిర్వహిస్తున్నామని కర్నూలు జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కిరప్ప పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాల చుట్టు 144 సెక్షన్ విధించినట్లు, పరీక్ష కేంద్రంలో విరుద్ధంగా ప్రవర్తిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. (అక్టోబర్ 5 నుంచి అంబేద్కర్ వర్సిటీ డిగ్రీ పరీక్షలు)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top