వైఎస్సార్, కర్నూలు జిల్లాల్లో సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటన | CM YS Jagan Visit To YSR And Kurnool Districts | Sakshi
Sakshi News home page

వైఎస్సార్, కర్నూలు జిల్లాల్లో సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటన

Apr 15 2022 3:42 AM | Updated on Apr 15 2022 7:53 AM

CM YS Jagan Visit To YSR And Kurnool Districts - Sakshi

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 15, 16 తేదీల్లో వైఎస్సార్, కర్నూలు జిల్లాల్లో పర్యటించనున్నారు. 15వ తేదీ సాయంత్రం గన్నవరం నుంచి బయలుదేరి కడప ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి ఒంటిమిట్టకు వెళ్లి, శ్రీ సీతారాముల వారిని దర్శించుకుంటారు. పట్టువస్త్రాలను సమర్పించి కళ్యాణోత్సవాన్ని తిలకిస్తారు.

రాత్రి కడపలో బస చేస్తారు. 16వ తేదీ ఉదయం రెండు వివాహ వేడుకల్లో పాల్గొని, అక్కడి నుంచి కర్నూలు చేరుకుంటారు. అక్కడ ఓ వివాహ వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించిన అనంతరం తిరిగి తాడేపల్లి చేరుకుంటారు.   

Advertisement
 
Advertisement
Advertisement