CM YS Jagan: అపాచీ పరిశ్రమతో 10 వేల మందికి ఉద్యోగాలు

CM YS Jagan Speech At Apache Manufacturing Unit Inagaluru - Sakshi

సాక్షి, తిరుపతి జిల్లా: శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ఇనగలూరులో రూ. 700 కోట్లతో ఏర్పాటు చేయబోతున్న అపాచీ పరిశ్రమకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం శంకుస్థాపన చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. ఇనగలూరులో అపాచీ పరిశ్రమ ఏర్పాటు చేయడం సంతోషకరమైన విషయమన్నారు. మొదటి దశలో రూ.350 కోట్లు, వచ్చే ఐదేళ్లలో మరో 350 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు సీఎం జగన్‌ తెలిపారు.

అపాచీ పరిశ్రమలో అడిడాస్‌ షూలు, లెదర్‌ జాకెట్స్‌, బెల్ట్‌లు వంటి ఉత్పత్తులను తయారు చేస్తారు. అపాచీ పరిశ్రమ ఏర్పాటుతో 10 వేల మందికి ఉద్యోగాలు అవకాశాలు లభిస్తాయన్నారు. 2023 సెప్టెంబర్‌ కల్లా పరిశ్రమ అందుబాటులోకి వస్తుందన్నారు. పరిశ్రమ ఏర్పాటుతో 80 శాతం మంది స్థానికులకే ఉద్యోగాలు వస్తాయని సీఎం జగన్‌ తెలిపారు. 

ఏపీ ప్రభుత్వం తోడ్పాటు మరువలేనిది: టోనీ
పరిశ్రమల ఏర్పాటుకు సహకారం అందించిన ముఖ్యమంత్రి వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డికి అపాచీ కంపెనీ డైరెక్టర్‌ టోనీ కృతజ్ఞతలు తెలియజేశారు. పరిశ్రమల ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం అందించిన తోడ్పాటు మరువలేనిదన్నారు. పారిశ్రామికరంగాన్ని సీఎం జగన్‌ ప్రోత్సహిస్తున్నారన్నారు. 

చదవండి: (ఒక్క రూపాయికే పక్కా ఇల్లు)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top