ఇడుపులపాయకు చేరుకున్న సీఎం జగన్‌ | CM YS Jagan Reached Idupulapaya | Sakshi
Sakshi News home page

ఇడుపులపాయకు చేరుకున్న సీఎం జగన్‌

Sep 1 2020 8:35 PM | Updated on Sep 1 2020 8:59 PM

CM YS Jagan Reached Idupulapaya - Sakshi

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్సార్‌ జిల్లా పర్యటనలో భాగంగా మంగళవారం ఇడుపుల పాయ చేరుకున్నారు. గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో ఇడుపులపాయకు వచ్చిన సీఎం జగన్‌కు ఘన స్వాగతం లభించింది. ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రఘురామిరెడ్డి, ఇతర అధికారులు సీఎం జగన్ కు స్వాగతం పలికారు. వారితో కాసేపు ముచ్చటించిన సీఎం.. తర్వాతా వైఎస్సార్‌ ఎస్టేట్‌లో బస చేసేందుకు వెళ్లారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి వర్థంతిని పురస్కరించుకుని రేపు(సెప్టెంబర్‌ 2) ఉదయం 9.45 గంటలకు వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద కుటుంబ సభ్యులతో కలిసి నివాళులర్పించి, ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. అనంతరం అక్కడ్నుంచి బయల్దేరి మధ్యాహ్నం 12.30కి సీఎం వైఎస్‌ జగన్‌ తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు.

Advertisement
 
Advertisement
Advertisement