నేడు మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఇలా.. | Sakshi
Sakshi News home page

నేడు మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఇలా..

Published Tue, Apr 16 2024 5:18 AM

CM YS Jagan Memantha Siddham Bus Yatra Schedule - Sakshi

నారాయణపురం నుంచి ఉదయం 9 గంటలకు ప్రారంభం

ఉండి శివారులో భోజన విరామం

సాయంత్రం భీమవరం బైపాస్‌ రోడ్‌ గ్రంథి వెంకటేశ్వరరావు జూనియర్‌ కాలేజ్‌ వద్ద సభ 

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 16వ రోజైన మంగళవారం(ఏప్రిల్‌ 16) షెడ్యూల్‌ను ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం సోమవారం విడుదల చేశారు. ఈ యాత్రలో భాగంగా సీఎం జగన్‌ సోమవారం రాత్రి బస చేసిన నారాయణపురం దగ్గర నుంచి మంగళవారం ఉదయం 9 గంటలకు బయలుదేరుతారు.

నిడమర్రు, గణపవరం మీదుగా ఉండి చేరుకుంటారు. ఉండి శివారులో సీఎం జగన్‌ భోజన విరామం తీసుకుంటారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి భీమవరం బైపాస్‌ రోడ్‌ గ్రంథి వెంకటేశ్వరరావు జూనియర్‌ కాలేజ్‌ వద్ద సాయంత్రం 3.30 గంటలకు బహిరంగ సభలో పాల్గొని సీఎం జగన్‌ ప్రసంగిస్తారు. సభ అనంతరం పిప్పర, పెరవలి, సిద్ధాంతం క్రాస్‌ మీదుగా ఈతకోట శివారులో ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి సీఎం చేరుకుంటారు. 

Advertisement
 
Advertisement