పాత, కొత్త మంత్రులతో సీఎం జగన్ తేనీటి విందు

సాక్షి, అమరావతి: ఏప్రిల్ 11న ఏపీ మంత్రివర్గం పునర్ వ్యవస్థీకరణ నేపథ్యంలో పాత, కొత్త మంత్రులతో కలిసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తేనీటి విందులో పాల్గొననున్నారు. మంత్రుల ప్రమాణ స్వీకారం అనంతరం తేనీటి విందు కార్యక్రమం ఉంటుంది. నూతన మంత్రుల ప్రమాణ స్వీకారానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఛ్మైరన్లు, అధికారులకు ఆహ్వానాలు పంపారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి Aa, A1, A2, B1, B2 కేటగిరీలుగా పాసులు జారీ చేశారు.