గోపూజ మహోత్సవం: అందరినీ ఆకట్టుకుంటున్న దృశ్యం

CM YS Jagan In Gopuja Mahotsavam Video Attracts Netizens - Sakshi

సాక్షి, గుంటూరు: గోపూజ మహోత్సవంలో ఒక దృశ్యం అందరినీ ఆకట్టుకుంది. స్టాల్స్‌ను సందర్శిస్తూ ముందుకు వెళ్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఓ గంగిరెద్దు వద్ద ఆగారు. అపుడు ఆయనను ఆశీర్వదిస్తున్నట్లు ఎద్దు తలను ఆడించింది. ఆ క్షణంలో ఇనుప కంచెకు అటువైపు ఉన్న గంగిరెద్దు తల, ఫెన్సింగ్‌పై ఉన్న ఇనుప రాడ్‌కు తగిలేలా అనిపించింది. దీంతో వెంటనే అప్రమత్తమైన సీఎం జగన్‌.. ఆ ఇనుప రాడ్‌పై తన చేతిని ఉంచారు. ఆ తర్వాత ఎద్దు తలను తన చేత్తో పక్కకి జరిపి జాగ్రత్త అంటూ గంగిరెద్దును ఆడిస్తున్న వ్యక్తిని హెచ్చరించారు. దీంతో అక్కడ ఉన్న వాళ్లంతా.. మూగజీవికి ఇబ్బంది కలగకుండా సీఎం జగన్‌ చూపించిన చొరవ చూసి.. ‘‘మరోసారి మనసున్న మారాజు అని నిరూపించుకున్నారు’’ అంటూ ఆయనపై అభిమానం చాటుకున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెటిజన్ల మనసు గెలుచుకుంటున్నాయి.(చదవండి: గోపూజ మహోత్సవంలో పాల్గొన్న సీఎం జగన్‌)

కాగా టీటీడీ, దేవాదాయశాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కనుమ పండుగ రోజున సంప్రదాయబద్ధంగా 2,147 ఆలయాల్లో గోపూజ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. గోమాత, గో ఉత్పత్తుల గొప్పతనంపై భక్తులకు తెలియజేస్తూ ఆలయాల్లో పోస్టర్లు, బ్యానర్లు ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లా నరసరావుపేట మున్సిపల్ స్టేడియంలో తలపెట్టిన గోపూజ మహోత్సవంలో సీఎం వైఎస్‌ జగన్‌ పాల్గొన్నారు. మొదట మున్సిపల్‌ స్టేడియంలో వివిధ స్టాళ్లను పరిశీలించిన ఆయన.. అనంతరం గోపూజ మహోత్సవంలో పాల్గొన్నారు. మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్‌, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, మేకతోటి సుచరిత, టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top