Breadcrumb
Live Updates
విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో సీఎం వైఎస్ జగన్ పర్యటన
కులం, మతం, ప్రాంతం చూడలేదు: సీఎం జగన్
పేదలకు సొంతిల్లు కల్పించడంలో కులం, మతం, ప్రాంతం చూడలేదని సీఎం జగన్ తెలిపారు. అయితే రాష్ట్రాని ఎక్కడి నుంచీ సహాయం రాకూడదని కొందరు కుయుక్తులు చేస్తున్నారని అన్నారు. దుష్టచతుష్టయం అంటే చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 అని అన్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా మహిళలకు మంచి చేయడంలో తాను రాజీ పడనని సీఎం జగన్ తెలిపారు. కోర్టుకు వెళ్లి పట్టాలు రాకుండా 489 రోజులు దుష్టచతుష్టయం అడ్డుకుందని మండిపడ్డారు. కడపు మంటతో రోజూ బురద చల్లుతున్నారని తెలిపారు. పేదలకు మంచి జరిగితే దుష్టచతుష్టయంకు కడుపు మంట అని అన్నారు.
ప్రభుత్వం మంచి చేస్తుంటే అడ్డంకులు సృష్టించారు: సీఎం జగన్
30 లక్షల ఇళ్ల నిర్మాణానికి రూ. 55 వేల కోట్లు ఖర్చు అవుతుందని సీఎం జగన్ తెలిపారు. ఇంటి స్థలాల విలువ రూ. 35 కోట్లు ఉంటుందని అన్నారు. కనీస సౌకర్యాల కల్పనకు మరో రూ. 32 వేల కోట్లు ఖర్చు అవుతుందని చెప్పారు. ఇవాళ ఇళ్ల పట్టాలు అందుకున్న మహిళల చేతుల్లో రూ.10 వేల కోట్ల ఆస్తి ఉందని తెలిపారు. మన ప్రభుత్వం మంచి చేస్తుంటే అడ్డంకులు సృష్టించారని తెలిపారు. చంద్రబాబు హయాంలో కనీసం 5 లక్షల ఇళ్లు కూడా కట్టలేదని తెలిపారు. ప్రతీ ఒక్కరికీ సొంతిల్లు ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. సచివాలయం, మార్కెట్ యార్డ్, మూడు పార్క్‌లు రాబోతున్నాయని తెలిపారు. 16 నెలల తర్వాత పేదల కల సాకారమవుతోందని తెలిపారు. ఇప్పటికే 16 లక్షల ఇళ్ల నిర్మాణం కూడా ప్రారంభించామని తెలిపారు. గజం రూ.12 వేల విలువున్న 50 గజాల స్థలం ఇస్తున్నామని సీఎం జగన్ చెప్పారు.
అందరికీ ఇల్లు ఇవ్వాలన్నదే నా లక్ష్యం: సీఎం జగన్
1.23 లక్షల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. అందరికీ ఇల్లు ఇవ్వాలన్నదే తన లక్ష్యమని పేర్కొన్నారు. ఇప్పటికే 30 లక్షల 70 వేల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చామని చెప్పారు. ఇళ్ల పట్టాలు, ఇల్లు మంజూరు పత్రాలు అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో 17 వేల జగనన్న కాలనీలు రాబోతున్నాయని అన్నారు. రెండో దశ నిర్మాణం ప్రారంభించమని అధికారులకు ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. ఇల్లు రాని వారు సచివాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చని సీఎం జగన్ అన్నారు.
ఇల్లు అంటే మహిళలకు శాశ్వత చిరునామా: సీఎం జగన్
పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమ సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. దేవుడి దయతో ఈ రోజు ఓ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని తెలిపారు. ఒక్క కాలనీలోనే 10228 ఇళ్ల నిర్మాణం జరుగుతోందని తెలిపారు. ఒక్కొక్కరికి సెంట్ స్థలం ఇస్తున్నామని, ఇక్కడ గజం స్థలం రూ.12 వేలు ఉందని అన్నారు. అంటే స్థలం విలువ అక్షరాల రూ. 6 లక్షలు అని తెలిపారు. ఒక ఇల్లు అంటే మహిళలకు శాశ్వత చిరునామా ఇచ్చినట్లు అవుతుందని అన్నారు. 16 నెలల క్రితమే ఈ కార్యక్రమం జరగాల్సిందని తెలిపారు.
సీఎం జగన్‌కు కృతజ్ఞతలు: ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్
ఇళ్ల పట్టాల పంపిణీ సభలో పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్ మాట్లాడుతూ.. తన నియోజవర్గంలోని సుమారు 2 లక్షల మందికి శాశ్వత నివాసాలు కల్పించడం ఆనందంగా ఉందని తెలిపారు. తన నియోజకవర్గ ప్రజలకు ఇళ్లు ఇచ్చినందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. కరోనా సమయంలో చంద్రబాబు ఉంటే.. కోవిడ్ పేరుతో మిగతా సంక్షేమ పథకాలు ఆపేసేవాడని చంద్రబాబు గొంతును అనుకరిస్తూ సభలో నవ్వులు పూయించారు.
సభలో పాల్గొన్న సీఎం జగన్
అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంపైడివాడ అగ్రహారంలో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణంలో సీఎం వైఎస్ జగన్ పాల్గొన్నారు.
పైలాన్ ఆవిష్కరించిన సీఎం జగన్

లే అవుట్ స్వరూపాన్ని పరిశీలించిన సీఎం జగన్ అనంతరం మోడల్ గృహాల్ని లబ్ధిదారులకు అందజేశారు. తర్వాత పైలాన్‌ను సీఎం జగన్ ఆవిష్కరించారు.
వైఎస్సార్ విగ్రహాన్నిఆవిష్కరించిన సీఎం జగన్
పైడివాడ అగ్రహారం చేరుకున్న సీఎం వైఎస్ జగన్.. వైఎస్సార్ పార్క్‌లో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు.
విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో సీఎం వైఎస్ జగన్ పర్యటన
విశాఖపట్నం చేరుకున్న సీఎం జగన్
విశాఖపట్నం: విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విశాఖపట్నం ఎయిర్ పోర్ట్‌కు చేరుకున్నారు. సబ్బవరం మండలం పైడివాడ అగ్రహారానికి సీఎం జగన్ హెలికాప్టర్లో బయలుదేరారు.
లబ్ధిదారులతో సీఎం జగన్ ముఖాముఖి
పైలాన్‌ను ఆవిష్కరించి, భూ సమీకరణకు సహకరించిన రైతులతో కాసేపు మాట్లాడి, వారితో ఫొటోలు దిగనున్నారు. అనంతరం సభా ప్రాంగణంలో లబ్ధిదారులతో మాట్లాడతారు. ఆ తర్వాత మధ్య తరగతి ప్రజల సొంతింటి కల నెరవేర్చే ఎంఐజీ ప్రాజెక్టును ప్రారంభిస్తారు. అనంతరం సభలో సీఎం జగన్ ప్రజలనుద్దేశించి మాట్లాడతారు. లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు, ఇళ్ల మంజూరు పత్రాలు పంపిణీ చేస్తారు.
లబ్ధిదారులకు అందజేత
అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం పైడివాడ అగ్రహారం ఇందుకు వేదిక కానుంది. లే అవుట్లో ఏర్పాటు చేసిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించి, పార్కును ప్రారంభిస్తారు. లే అవుట్ స్వరూపాన్ని పరిశీలించిన అనంతరం మోడల్ గృహాల్ని లబ్ధిదారులకు అందజేస్తారు.
విశాఖ, అనకాపల్లి ఇళ్ల పట్టాల పంపిణీ
విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల ప్రజల సొంతింటి కల కార్యరూపం దాల్చనుంది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా 1.23 లక్షల మందికి ఇళ్ల పట్టాల పంపిణీ జరగనుంది.
విశాఖపట్నం బయలుదేరిన సీఎం జగన్
తాడేపల్లి: విశాఖపట్నం, అనకాపల్లి ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బయలుదేరారు. సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు సీఎం జగన్ బయలుదేరారు. అక్కడి నుంచి విశాఖపట్నం చేరుకోనున్నారు.
Related News By Category
Related News By Tags
-
జెడ్ ప్లస్ సెక్యూరిటీ తెలియదా?.. సీపీ హుందాగా మాట్లాడాలి: అమర్నాథ్
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ఉత్తరాంధ్ర పర్యటనను విజయవంతం చేసినందుకు పార్టీ శ్రేణులకు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇదే సమయంలో విశాఖ సీపీ వ్యాఖ...
-
జడివానలో.. జన ఉప్పెన
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం, సాక్షి, అనకాపల్లి: సాగర తీరంలో జన ఉప్పెన ఎగసిపడింది. ఉత్తరాంధ్ర పర్యటనలో మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటనను అడ్డుకునేందుకు కూటమి సర్కారు పోలీసుల ద్వారా ఎన్ని ఆంక్షలు విధించి...
-
‘ఉక్కు’ సంకల్పంతో అండగా ఉంటాం
సాక్షి, విశాఖపట్నం: విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకు ఉక్కు సంకల్పంతో ఎప్పుడూ అండగా ఉంటామని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. గురువారం నర్సీపట్నం పర్యటన సందర్భంగా విశాఖ ఎయిర్పోర్...
-
ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరవాలి: వైఎస్ జగన్
విశాఖ: నగరంలోని కేజీహెచ్ ఆస్పత్రిలో పచ్చకామెర్లతో చికిత్స పొందుతున్న కురుపాం పాఠశాల విద్యార్థులను వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పరామర్శించారు. గురువారు(అక్టోబర్ 9వ ...
-
జగన్ పర్యటనలో పోలీసుల నిర్లక్ష్యం
అనకాపల్లి జిల్లా : వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అనకాపల్లి జిల్లా పర్యటనలో పోలీసుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనబడింది. మాకవరపాలెం మెడికల్ కాలేజీలో పోలీసుల పనితీరు ద...