చిత్తూరు: పేపర్‌ ప్లేట్ల పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం.. ముగ్గురి సజీవ దహనం

Chittoor: Fire Accident Kills Three At Paper Plates Factory - Sakshi

సాక్షి, చిత్తూరు: జిల్లాలో ఘోరం జరిగింది. పేపర్‌ ప్లేట్లు తయారు చేసే పరిశ్రమలో మంటలు చెలరేగి ముగ్గురు సజీవదహనం అయ్యారు. మంగళవారం అర్ధరాత్రి దాటాక ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

రంగాచారి వీధిలో ఉన్న పేపర్‌ ప్లేట్ల తయారీ పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ మంటల్లో చిక్కుకుని ముగ్గురు సజీవదహనం అయ్యారు. మృతుల్ని భాస్కర్‌, ఢిల్లీ బాబు, బాలాజీగా గుర్తించారు. షార్ట్‌ స్కర్యూట్‌తో అర్ధరాత్రి 2గం​. సమయంలో ప్రమాదం జరిగిందని తెలుస్తోంది.

మృతుల్లో తండ్రీకొడుకులతో పాటు ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఉన్నట్లు సమాచారం. కాగా.. ఫ్యాక్టరీ యాజమాని కొడుకు ఢిల్లీబాబు సదరు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా నిర్ధారణ అయ్యింది. ఈ ఘటనతో స్థానికంగా విషాదం నెలకొంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top