కాకినాడ: ఏ విషయంలో తేడా వచ్చిందో ఏమో.. సయ్యంటే సైయ్యంటూ ఢీకొన్నాయీ వృషభరాజాలు. సహజంగానే బలిష్టంగా ఉండే ఆ ఎద్దులు నడిరోడ్డుపై అలా వీరంగం సృష్టింస్తుంటే చుట్టుపక్కల వారు.. వాహన చోదకులు.. పాదచారులు ఒకింత భీతిల్లారు. ఏ మాత్రంఅదుపుతప్పి అవి తమ మీద పడినా అంతే సంగతులు. ఓ అరగంట తరవాత అవే అలసిపోయి తలోదారీ వెళ్లాక కానీ వారి ఆందోళన తీరలేదు. అంబాజీపేట నాలుగు రోడ్ల జంక్షన్‌లో శుక్రవారం ఉదయం ఈ వీరంగం స్థానికులకు గగుర్పొడిచేలా సాగింది.


