విద్యావిధానంలో సమూల మార్పులకు శ్రీకారం

Botsa Satyanarayana International Mother Language Day Celebration - Sakshi

తెలుగును పరిరక్షించుకుంటున్నాం

పోటీ ప్రపంచంలో నిలబడేలా సిలబస్‌లో మార్పులు తెచ్చాం

అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ వేడుకల్లో మంత్రి బొత్స 

30 మంది కళాకారులు, సాహితీవేత్తలు, జర్నలిస్టులు, భాషాకోవిదులకు పురస్కారాలు

గాంధీనగర్‌ (విజయవాడ సెంట్రల్‌): మాతృభాషను పరిరక్షించుకునేందుకు ప్రభుత్వం విద్యావిధానంలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టిందని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. తెలుగు భాషను ప్రోత్సహిస్తూనే సువిశాల ప్రపంచంలో పోటీని తట్టుకుని నిలబడేలా సిలబస్‌లో మార్పులు తెచ్చామని చెప్పారు.

అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా మంగళవారం ఆంధ్రప్రదేశ్‌ అధికార భాషా సంఘం తెలుగు భాషాభివృద్ధి కోసం కృషి చేసిన 30 మంది కళాకారులను, భాషా­కోవిదులను, సాహితీవేత్తలను, జర్నలిస్టులను ‘మాతృ­భాషా సేవా శిరోమణి’ పురస్కారాలతో సత్కరించింది.

విజయవాడలో జరిగిన పురస్కార ప్రదానోత్సవ సభకు మంత్రి బొత్స ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ అధికార భాషా సంఘం అధ్యక్షుడు పి.విజయబాబు అ«ధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. సీఎం వైఎస్‌ జగన్‌ తెలుగు భాషకు ప్రాధాన్యతనిస్తూనే ఇతర భాషల ఆవశ్యకతను గుర్తించారని తెలిపారు.

ఆంగ్లం నేర్చుకుని తెలుగును విస్మరించాలనే అభిప్రాయం సీఎంకు లేదన్నారు. ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు నిర్వహించిన పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎడిటర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు వి.వి.ఆర్‌.కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు.

పురస్కార గ్రహీతలు వీరే..
కల్లూరి భాస్కరం, డాక్టర్‌ విజయలక్ష్మీ పండిట్, డాక్టర్‌ ఓలేటి పార్వతీశం, పెరుగు రామకృష్ణ, డాక్టర్‌ కప్పగంతుల రామకృష్ణ, ఉపద్రష్ట రమణ, వేంపల్లి షరీఫ్, నవ మల్లెతీగ సంపాదకుడు కలిమిశ్రీ, గుంటూరు రామరాజు, డాక్టర్‌ పాము­లపాటి వెంకట శేషయ్య, పి.వి.గుణశేఖర్, డాక్టర్‌ పర్వతనేని కృష్ణమోహన్, షేక్‌ అహ్మద్‌ జయా, వెంకట్‌ పూలబాల, వెంకటేష్‌ కులకర్ణి, ఎం.ఎ.రజాక్, సత్యవోలు రాంబాబు, టేకుమళ్ల వెంకటప్పయ్య, బి.అశోక్‌ కుమార్, కట్టెకోల చిన నరసయ్య, రమేష్‌ ఆడ్రికడర్ల, పొక్కులూరు సుబ్బారావు, కరణ్‌ శర్మ, గాజుల సత్యనారాయణ, అన్నవరపు బ్రహ్మయ్య. హర్మోహీందర్‌ సింగ్‌ సహనీ, డాక్టర్‌ కె.జి.ఆర్‌. శేషుకుమార్, డాక్టర్‌ కె.ఎస్‌. గోపాలదత్త, డాక్టర్‌ తిరుమలశెట్టి సుబ్రహ్మణ్యమూర్తి ఉన్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top