ఆ లిమిట్స్ దాటితే అనేక సమస్యలు వస్తాయి

Botsa Satyanarayana Comments On GAG Order Over Amaravati Land Scam - Sakshi

సాక్షి, అమరావతి : ‘చట్టం తన పని తాను చేసుకోవాలి. న్యాయ వ్యవస్థ తన పని తాను చేసుకుంటుంది. ఆ లిమిట్స్ దాటితే అనేక సమస్యలు వస్తాయ’ని మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘  రాజ్యాంగం, న్యాయ వ్యవస్థను గౌరవించే వ్యక్తిగా వాస్తవ విషయాలు చెప్తున్నా. నిన్న మొన్న వచ్చిన తీర్పులను అవగాహన చేసుకుంటూ న్యాయస్థానం పట్ల విధేయతతో చెప్తున్నా. అమరావతి అవినీతి విచారణపై ఒక గాగ్ ఆర్డర్ ఇచ్చారు. నారా చంద్రబాబునాయుడు మనుషులు, ఆయన తనయుడు దోపిడీ చేశారని చెప్పాము. మేము చెప్పినట్లే ప్రభుత్వం వచ్చాక గత ప్రభుత్వ అవకతవకలు, అవినీతిని రాజ్యాంగ బద్దంగా విచారిస్తున్నాం. దీనిలో భాగంగానే అమరావతి ఇన్‌సైడ్‌ ట్రేడింగ్‌పై శాసన సభలో చర్చ చేశాం. కేబినెట్ సబ్ కమిటీ వేసి నిశితంగా పరిశీలించాం.

సిట్ వేసి పరిశీలించమని కూడా చెప్పాము. ప్రాథమిక ఆధారాలు ఉన్నాయనే విచారణ చేపట్టాం. దానిలో చాలా అవకతవకలు గమనించి ఏసీబీకి ఇచ్చాం. దానిలో దమ్మలపాటి శ్రీనివాస్, సుప్రీం కోర్ట్ న్యాయమూర్తుల కుమార్తెలపై అభియోగాలు వచ్చాయి. వారు చేసిన దుశ్చర్యలపై విచారణ చేయొద్దంటే ఎలా?. ఎన్నో కేసులను కోర్టులే విచారించమని ఆదేశించిన సందర్భాలున్నాయి.  పేద వాడికి ఇల్లు ఇవ్వాల్సిన అవసరం లేదా?. సాక్షాత్తు ఐఏఎస్, సుప్రీం కోర్ట్ జడ్జిలకు స్థలాలు ఇవ్వొచ్చా?. చంద్రబాబు లాంటి వ్యక్తులు దోచుకు తింటే దానికి వత్తాసు పలకాలా?. పెద్దల పేరుంటే టీవీలో, సోషల్ మీడియాలో రాకూడదా?. ( కోవిడ్‌ లక్షణాలున్నా పరీక్షలు రాయొచ్చు )

సాక్షాత్తు న్యాయ కోవిదులు కూడా ఇదే ప్రశ్నిస్తున్నారు. మా ఎంపీలు ఈ రోజు పార్లమెంటులో ప్రశ్నించారు. స్టార్టింగ్‌లోనే కేబినెట్ సబ్ కమిటీని వద్దంటే ఇదెక్కడి న్యాయం. ఆ పిల్ వేసింది ఎవరు?. ఓ పార్టీకి చెందిన వ్యక్తులు. రాజకీయ స్వార్థం కోసం వాళ్లు పిల్ వేస్తే. ఇటువంటి ఆదేశాలు రావడంపై ఏమి చేయాలి. మా సీఎం, మంత్రులు, ప్రభుత్వానికి న్యాయ వ్యవస్థపై గౌరవం ఉంది. ఎవరో న్యాయవాది, న్యాయమూర్తి కూతుర్ల పేర్లు వచ్చాయని ఇలాంటి నిర్ణయం తీసుకోవటం సమంజసమా?. జరిగిన అవినీతి ప్రజలకు తెలపడానికి మేము ముందుకు వెళుతుంటే మాకు ఎక్కడుంది న్యాయం. సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తులపై సైతం ఆరోపణలు వచ్చాయి. అప్పుడు కూడా ఇలాంటి గాగ్ ఆర్డర్ ఇవ్వలేదే?’’ అని ప్రశ్నించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top