‘మూడో వ్యక్తి కంప్లయింట్‌ చేస్తే కేసు పెడతారా?’ | Bhargav bail plea: Ponnavolu Arguments Andhra Pradesh HC | Sakshi
Sakshi News home page

Sajjala Bhargav Reddy: మూడో వ్యక్తి కంప్లయింట్‌ చేస్తే కేసు పెడతారా?

Published Fri, Nov 29 2024 3:40 PM | Last Updated on Fri, Nov 29 2024 4:23 PM

Bhargav bail plea: Ponnavolu Arguments Andhra Pradesh HC

అమరావతి, సాక్షి: ఏపీ హైకోర్టులో సజ్జల భార్గవ్‌ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ(శుక్రవారం) విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఆయన తరఫున సీనియర్‌ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌ రెడ్డి వాదనలు వినిపించారు. ఇది అసలు విచారణ అర్హత లేని కేసంటూ కోర్టు దృష్టికి తీసుకెళ్లారాయన.

ఈ కేసులకు అసలు విచారణ అర్హత లేదు. ఎవరు పైన అయితే పోస్ట్ పెట్టారో వాళ్లు కంప్లైంట్ చేయలేదు. ఎవరో మూడో వ్యక్తి కంప్లైంట్ చేస్తే కేసు నమోదు చేశారు. ఈ పోస్టులపై ఐటీ సెక్షన్స్ బదులుగా.. పోలీసులు నాన్‌బెయిలబుల్‌ సెక్షన్స్ పెట్టారు. ఇది ఆర్గనైజర్ క్రైమ్ అని పోలీసులు చెప్తున్నారు. కానీ, ముమ్మాటికి ఇది అలాంటి నేరమేం కాదు అని పొన్నవోలు వాదించారు.

ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న కోర్టు.. తదుపరి విచారణను వచ్చేనెల 6వ తేదీకి వాయిదా వేసింది. అప్పటిదాకా అప్పటివరకు ఎటువంటి కఠిన చర్యలు తీసుకోవద్దన్న ఆదేశాలను పొడిగిస్తున్నట్లు తెలిపింది.

ఇక.. సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్రా రవీందర్ రెడ్డి హెబియస్ కార్పస్ పిటిషన్ పై విచారణను వచ్చే నెల మూడో తేదీకి వాయిదా వేసింది కోర్టు. మరోవైపు.. బాపట్ల కోర్టులో వర్రా రవీందర్‌ రెడ్డిని మెజిస్ట్రేట్‌ ముందు ప్రవేశపెట్టారు. ‘ఏ కేసులో మిమ్మల్ని అరెస్టు చేశారో తెలుసా?’’ అని రవీందర్ రెడ్డిని మేజిస్ట్రేట్ ప్రశ్నించారు. అయితే.. కేసుకు సంబంధించి ఎలాంటి డాక్యుమెంట్లు తనకు ఇవ్వలేదని రవీందర్‌రెడ్డి చెప్పారు. దీంతో.. పోలీసులను  న్యాయమూర్తి మందలించారు. అలాగే.. వర్రాకు వచ్చే నెల 13వ తేదీదాకా రిమాండ్‌ విధించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement