‘ఆత్మీయ సమ్మేళనానికి సీఎం జగన్‌ను ఆహ్వానిస్తాం’

BC Ministers And Leaders In AP Meet At Vijayawada - Sakshi

విజయవాడ: వచ్చేనెల 8వ తేదీన విజయవాడలో జరుగనున్న బీసీల ఆత్మీయ సమ్మేళనానికి సీఎం జగన్‌ను ఆహ్వానిస్తామని మంత్రి వేణుగోపాలకృష్ణ తెలిపారు. ఈరోజు(శనివారం) నగరంలో బీసీ మంత్రుల, నేతల సమావేశం జరిగింది. దీనిలో భాగంగా మాట్లాడిన మంత్రి వేణుగోపాలకృష్ణ.. ‘ వ‍చ్చే నెల8వ విజయవాడలో బీసీల ఆత్మీయ సమ్మేళనం. సమ్మేళనానికి సీఎం జగన్‌ను ఆహ్వానిస్తాం. చంద్రబాబు బీసీల ద్రోహి. మాది బీసీల ప్రభుత్వం. బీసీల ఆత్మరక్షకుడు సీఎం జగన్‌ మాత్రమే’ అని పేర్కొన్నారు.

మంత్రి జయరాం మాట్లాడుతూ.. ‘56 కార్పోరేషన్లతో బీసీలకు సీఎం జగన్‌ ఎంతో మేలు చేశారు. బీసీల అభ్యున్నతికి సీఎం చేసిన కృషి చరిత్రలో నిలిచిపోతుంది. బీసీలకు రూ. 88 వేల కోట్ల సంక్షేమ పథకాలు అందాయి’ అని తెలిపారు

ఎంపీ మార్గాని భరత్‌ మాట్లాడుతూ..బీసీలకు చంద్రబాబు చేసేందేమీ లేదు. బీసీలను చంద్రబాబు కేవలం ఓటు బ్యాంకుగానే వాడుకున్నారు.బీసీలకు అన్ని విధాల సీఎం జగన్‌ అండగా నిలిచారు’ అని అన్నారు.  ‘బీసీ డిక్లరేషన్‌లో పొందుపరిచిన ప్రతి అంశాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. 139 కులాలకు అనేక సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ప్రతి కులానికి ఒక కార్పోరేషన్‌ ఏర్పాటు చేసిన ఘనత సీఎం జగన్‌దే’ అని జంగా కృష్ణమూర్తి స్పష్టం చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top