4 Ayyappa Devotees Killed And 16 Injured In Road Accident Near Bapatla, Details Inside - Sakshi
Sakshi News home page

Bapatla Road Accident: ఘోర రోడ్డు ప్రమాదంలో అయ్యప్ప భక్తుల మృతి

Dec 5 2022 10:59 AM | Updated on Dec 5 2022 1:30 PM

Bapatla: Ayyappa devotees killed in a fatal road accident - Sakshi

వేమూరు మండలం జంపని వద్ద సోమవారం వేకువ ఝామున రోడ్డు ప్రమాదం సంభవించింది. 

సాక్షి, బాపట్ల: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వాహనం బోల్తా పడిన ఘటనలో నలుగురు అయ్యప్ప భక్తులు దుర్మరణం పాలయ్యారు. వేమూరు మండలం జంపని వద్ద సోమవారం వేకువ ఝామున రోడ్డు ప్రమాదం సంభవించింది. 

ఈ ఘటనలో మరో 16మందికి గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని తెనాలి ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనా స్థలంలోనే ముగ్గురు మృతి చెందగా, మరొకరు ఆస్పత్రిలో కన్నుమూశారు.

మృతులను బొల్లిశెట్టిపండురంగారరావు, బుద్దన పవన్ కుమార్, బార్డటి రమేష్, పాశంరమేష్‌గా గుర్తించారు. మృతులది కృష్ణా జిల్లా,పెడన నియోజకవర్గం,నిలపూడి గ్రామంగా గుర్తించారు. ఘటన సమయంలో వాహనంలో 22 మంది ఉన్నారని,  పొగ మంచు కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమిక నిర్దారణకు వచ్చారు పోలీసులు.

Advertisement
 
Advertisement
Advertisement