సీఎంపై అనుచిత వ్యాఖ్యలు.. ఆదినారాయణపై కేసు నమోదు చేస్తాం: ఏఎస్పీ

Asp Anil Kumar Explanation On Mandadam Controversy - Sakshi

సాక్షి, గుంటూరు: సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆదినారాయణపై కేసు నమోదు చేస్తామని ఏఎస్పీ అనిల్‌కుమార్‌ అన్నారు. ఆదినారాయణరెడ్డి రెచ్చగొట్టేలా మాట్లాడారన్నారు.

‘‘బహుజన పరిరక్షణ కమిటీ సభ్యులు, సత్యకుమార్‌ అనుచరుల మధ్య గొడవ జరిగింది. ఇరువర్గాలు పోటాపోటీగా నినాదాలు చేసుకున్నారు. పోలీసులు ఉండబట్టే సమస్య వెంటనే సద్దుమణిగింది. పోలీసులు వెంటనే అప్రమత్తమై ఇరువర్గాలకు సర్ది చెప్పారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా విధులు నిర్వహించాం. సత్యకుమార్‌పై ఎలాంటి దాడి జరగలేదు’’ అని ఏఎస్పీ స్పష్టం చేశారు.

కాగా, మందడంలో బీజేపీ నేతలు వీరంగం సృష్టించారు. దీక్ష శిబిరం వద్ద దళితులపై బీజేపీ నేత సత్యకుమార్‌ అనుచరులు దాడికి పాల్పడ్డారు. సత్యకుమార్‌ అనుచరుల తీరుపై బహుజన పరిరక్షణ సమితి ఆగ్రహం వ్యక్తం చేసింది. సత్యకుమార్‌ వాహనాన్ని అడ్డుకున్న బహుజన పరిరక్షణ సమితి నేతలు.. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బహుజన పరిరక్షణ సమితి ఆందోళనతో ఉద్రిక్తత చోటుచేసుకుంది.
చదవండి: ఎంత ఎబ్బెట్టుగా ఉందో.. ఇంతకీ లోకేష్‌ డైరీలో ఏముంది?

మరిన్ని వార్తలు :

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top