శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు | Apollo Chairman, MP Satyavath Visit Tirumala On Thursday | Sakshi
Sakshi News home page

శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు

Dec 24 2020 10:29 AM | Updated on Dec 24 2020 1:50 PM

Apollo Chairman, MP Satyavath Visit Tirumala On Thursday - Sakshi

సాక్షి, తిరుమల: కలియుగ వైకుంఠదైవం తిరుమల శ్రీవారిని  పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. గురువారం ఉదయం వీఐపీ దర్శనం లో అపోలో చైర్మన్ ప్రతాప్ సీ రెడ్డి, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, టీటీడీ పాలకమండలి సభ్యుడు శివకుమార్, అనకాపల్లి ఎంపీ సత్యవతి, తెలంగాణ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, తెలంగాణ ఎమ్మెల్సీ లక్ష్మీరావు, తెలంగాణ ఐఎఎస్ శ్రీనివాసు రాజు తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్ధప్రసాదాలు అందజేశారు.

టీటీడీ పాలకమండలి సభ్యుడు శివకుమార్ మాట్లాడుతూ.. గోవు అంతరించిపోకముందే వాటిని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం ‌అపోలో‌ చైర్మన్ ప్రతాప్ సీ రెడ్డి మాట్లాడుతూ.. స్వామివారి కృపతో అపోలో ద్వారా మరింత సేవ చెయ్యాలని కోరుకుంటున్నా అన్నారు.








Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement