11, 12 తేదీల్లో సచివాలయ ఉద్యోగుల ‘ఛలో విజయవాడ’ | AP Secretariat Employees Protest on April 11th and 12th: Andhra Pradesh | Sakshi
Sakshi News home page

11, 12 తేదీల్లో సచివాలయ ఉద్యోగుల ‘ఛలో విజయవాడ’

Apr 6 2026 5:19 AM | Updated on Apr 6 2026 5:20 AM

AP Secretariat Employees Protest on April 11th and 12th: Andhra Pradesh

సాక్షి, అమరావతి: న్యాయబద్ధంగా తమకు దక్కాల్సిన నోషనల్‌ ఇంక్రిమెంట్లు తక్షణమే మంజూరు చేయాలని, ఉద్యోగుల నుంచి ఎలాంటి వివరణ తీసుకోకుండా సస్పెండ్‌ చేసే ప్రక్రియకు స్వస్తి పలకాలని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల జేఏసీ డిమాండ్‌ చేసింది.

సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 11, 12 తేదీల్లో ‘ఛలో విజయవాడ’ కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ‘సచి­వా­లయ ఉద్యోగుల ఆవేదన’ పేరిట జేఏసీ చైర్మన్‌ బూరాడ మధుబాబు రెండు రోజుల నిరాహార దీక్ష చేయనున్నట్టు ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తమ సమస్యలు పరిష్కారం అయ్యే వర­కు వెనకడుగు వేసేది లేదని తేల్చి చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement