
విజయవాడ: గత టీడీపీ ప్రభుత్వం హయాంలో సింగపూర్ సంస్థలకు 1,450 ఎకరాలు ఇచ్చామని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ స్పష్టం చేశారు. అయితే అటు తర్వాత సింగపూర్ ప్రభుత్వంతో సంబంధాలు దెబ్బతిన్నాయన్నారు. ప్రస్తుతం ఆ సంబంధాలను పునరుద్ధరించడానికే సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటన చేపట్టారన్నారు.
సింగపూర్ సంస్థలు అమరావతికి వస్తామని ఏమీ పాకులాడలేదని, తామే వెంటపడ్డామన్నారు. సింగపూర్ పెట్టుబడు దారులు వస్తే తాము చర్చలు జరుపుతామని నారాయణ అన్నారు.