‘టీడీపీ పెద్ద ఫేక్‌.. ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబూ ఫేక్‌’

AP Housing Minister Jogi Ramesh Criticizes Telugu Desam Party - Sakshi

కొత్తపేట: ‘తెలుగుదేశం పార్టీ పెద్ద ఫేక్‌.. ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడూ ఫేక్‌.. అలాంటి బాబుకు ఫేక్‌ ప్రచారం చేయడం అలవాటే’ అని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్‌ విమర్శించారు. ఎంపీ గోరంట్ల మాధవ్‌ వీడియో ఫేక్‌ అయినప్పటికీ, అది ఒరిజినల్‌ అంటూ.. అమెరికాలోని ఓ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ రిపోర్టు ఇచ్చిందంటూ టీడీపీ దుష్ప్రచారం చేస్తుండటంపై తీవ్రంగా మండిపడ్డారు. గురువారం డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన టీడీపీ తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు.

గోరంట్ల మాధవ్‌ ఫేక్‌ వీడియోను పట్టుకుని.. ఒక ఫేక్‌ సర్టిఫికెట్‌ సృష్టించుకుని గవర్నర్‌ దగ్గరకు వెళ్లటం దారుణం అని చెప్పారు. ‘వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలో ప్రజలకు ఎలాంటి సమస్యలు లేవు కాబట్టి ఇలాంటి ఫేక్‌ వీడియోలతో దుష్ప్రచారం చేయడం టీడీపీకి అలవాటుగా మారింది. అది ఒరిజినల్‌ కాదని అమెరికాలోని ఆ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ వారే స్వయంగా ఈ మెయిల్‌ ద్వారా తెలిపారు. చంద్రబాబు, టీడీపీ నేతలపై తగు చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరుతున్నాం’ అని తెలిపారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి చంద్రబాబు ఏ విధంగా టీడీపీకి ఫేక్‌ అధ్యక్షుడయ్యారో అందరికీ తెలుసని చెప్పారు.

ఇదీ చదవండి: ఫేక్‌ రిపోర్ట్‌.. ఫేక్‌ పార్టీ.. ఫేక్‌ లీడర్‌ 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top