గ్యాలంట్రీ అవార్డు గ్రహీతలకు ఆర్ధిక సాయం పెంపు

AP Govt Has Increased Financial Assistance To Gallantry Award Recipients - Sakshi

సాక్షి, అమరావతి: గ్యాలంట్రీ అవార్డు గ్రహీతలకు ఆర్ధిక సాయం పెంచుతూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తిరుపతిలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటన మేరకు ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం 10 రెట్లు పెంచింది.

పరమవీరచక్ర, అశోకచక్ర పురస్కారానికి రూ.10 లక్షల ఆర్థిక సాయాన్ని కోటి రూపాయలు, మహావీరచక్ర, కీర్తిచక్ర పురస్కారాలకు రూ.8 లక్షల ఆర్ధిక సాయాన్ని రూ.80 లక్షలకు పెంచుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వీరచక్ర, శౌర్యచక్ర పురస్కారాలకు రూ.6లక్షల ఆర్ధిక సాయాన్ని రూ.60 లక్షలకు పెంచింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారికి మాత్రమే వర్తిస్తుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

చదవండి:
యోధులారా వందనం : సీఎం జగన్‌

మాట ఇచ్చారు.. నిలబెట్టుకున్నారు..

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top