వరద బాధితులకు అండగా ఏపీ సర్కార్‌

AP Government Providing Essential Goods For Floods Affecting People - Sakshi

సాక్షి, అమరావతి: గత వారం రోజులుగా సంభవిస్తున్న వరదల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉభయగోదావరి జిల్లాల్లో వరద బాధితులకు నిత్యావసర సరుకులను ఉచితంగా పింపిణీ చేయాలని ప్రభుత్వం సోమవారం ఆదేశించింది. ఈ మేరకు ముఖ్యమ్యంత్రి  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వరద ప్రభావిత ప్రాంతాలలో నిత్యావసర సరకులను పంపిణీ చేయాలని అధికారలను ఆదేశించారు. ఈ నేపథ్యంలో 25 కిలోల రైస్‌(బియ్యం)తో పాటు మొత్తం ఆరు రకాల సరుకులు అందించాలని ఉత్తర్వులు జారీ చేసింది. కాగా వరదల కారణంగా వారానికి పైగా జలమయమైన ప్రాంతాల్లోని కుటుంబాలకు ఉచిత రేషన్ అందించాలని ఉత్తర్వుల్లో సర్కార్‌  పేర్కొంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top