కరోనా రోగి వద్ద కాలింగ్‌ బెల్‌

AP Government Has Ordered The Setting Up Of Calling Bells In Corona Hospital Wards - Sakshi

కోవిడ్‌ ఆస్పత్రుల్లోని అన్ని వార్డుల్లో ఏర్పాటు

ఎమర్జెన్సీ సేవలకు వీలు బజర్‌ నొక్కగానే డాక్టర్‌ లేదా నర్సు రాక

ఆదేశాలు జారీచేసిన ఆరోగ్యశాఖ

సాక్షి, అమరావతి: కరోనాతో వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారి పడకల దగ్గర కాలింగ్‌ బెల్స్‌ ఏర్పాటు చేయనున్నారు. కొన్ని ఆస్పత్రుల్లో వైద్యులు తరచూ రౌండ్స్‌కు వెళ్లడం లేదన్న విమర్శలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అవసరమైనప్పుడు రోగి బెల్‌ నొక్కితే చాలు.. నర్సు లేదా డాక్టర్‌ వచ్చి పేషెంట్‌ పరిస్థితి తెలుసుకునే వీలుంటుంది. ఈ నేపథ్యంలో అన్ని కోవిడ్‌ ఆస్పత్రుల్లో వీటిని ఏర్పాటు చేయాలని సూపరింటెండెంట్‌లకు ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చారు. 

ఐసీయూ, నాన్‌ ఐసీయూ, ఆక్సిజన్, జనరల్‌ వార్డుల్లో ఈ బెల్స్‌ ఏర్పాటు చేసి, రిసెప్షన్‌ చాంబర్‌తో అనుసంధానిస్తారు. 
ఒక్కసారి బజర్‌ నొక్కగానే వార్డులో గంట మోగడంతో పాటు లైట్లు కూడా వెలుగుతాయి.
డాక్టర్‌ లేదా నర్సు వచ్చే వరకూ ఈ గంట మోగుతూనే ఉంటుంది.
ఎమర్జెన్సీ సేవలు అవసరమయ్యే రోగులను వెంటనే గుర్తించే వీలుంటుంది. ఇప్పటికే రోగులకు అందుతున్న సేవల పరిశీలనకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు.

టార్గెటెడ్‌ వారికి నిర్ధారణ పరీక్షలు..
ఎక్కువ టెస్టులు చేయడం, ఎక్కువ మందిని గుర్తించి కట్టడి చేయడమనే విధానంతో ముందుకెళుతున్న సర్కారు.. మరింత నిర్దేశిత లక్ష్యంతో నిర్ధారణ పరీక్షలు చేయాలని భావిస్తోంది. అదెలాగంటే.. 
కరోనా లక్షణాలు బాగా కనిపిస్తున్న వారికి..
జ్వరం, జలుబు వంటి వాటితో బాధపడుతున్న వారికి
60 ఏళ్లు దాటిన వారికి మధుమేహం, బీపీ, గుండె జబ్బులు, క్యాన్సర్‌ వంటి వాటితో బాధపడుతున్న వారికి పరీక్షలు చేస్తారు.
ఎక్కువ టెస్టులు చేసినా తక్కువ పాజిటివ్‌లు వచ్చాయన్న దానికంటే.. ఎక్కువ టెస్టులు చేసి ఎక్కువ పాజిటివ్‌లు గుర్తించేలా చర్యలు. ఫలానా వారికి టెస్టు చేస్తే పాజిటివ్‌ అయి ఉండాలన్న లక్ష్యంతో పరీక్షలు  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top