నేడు ఏపీ ఈసెట్‌ | Sakshi
Sakshi News home page

నేడు ఏపీ ఈసెట్‌

Published Tue, Jun 20 2023 8:01 AM

AP Ecet Exam Today - Sakshi

బాలాజీచెరువు (కాకినాడ సిటీ): పాలిటెక్నిక్, బీఎస్సీ(గణితం) ఉత్తీర్ణులైన విద్యార్థులు నేరుగా ఇంజినీరింగ్‌ ద్వితీయ సంవత్సరంలో ప్రవేశాలకు సంబంధించిన ఏపీ ఈసెట్‌–23 పరీ­క్షను మంగళవారం ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 103 పరీక్షా కేంద్రాలు, హైదరాబాద్‌లో రెండు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ పరీక్షకు 38,255 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 28,640 మంది బాలు­రు, 9,615 మంది బాలికలు ఉన్నారు.

ఈ పరీక్షను ఆన్‌లైన్‌లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండు సెషన్లలో నిర్వహిస్తారు. ఉద­యం సెషన్‌లో అగ్రికల్చరల్, సిరామిక్‌ టెక్నాలజీ, సివిల్‌ ఇంజినీరింగ్, సీఎస్‌ఈ, కెమికల్, బీఎస్సీ(గణితం) ఈఈఈ విభాగాలకు, మధ్యా­హ్నం సెషన్‌లో ఈసీఈ, ఈఐఈ, మెకానికల్‌ మెటలర్జికల్, మైనింగ్‌ ఇంజినీరింగ్, ఫార్మసీ విభాగాల పరీక్ష నిర్వహిస్తారు. ఈ నెల 23న ప్రాథమిక కీ విడుదల చేస్తామని, 25 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తామని, జూలై మొదటి వారంలో ఫలితాలు వి­డుదల చేస్తామని ఈసెట్‌–2023 చైర్మన్, జేఎన్‌టీయూకే వీసీ ప్రొఫెసర్‌ జీవీఆర్‌ ప్రసాదరాజు సోమవారం తెలిపారు. విద్యార్థుల సందేహా­లను నివృత్తి చేసేందుకు 8500404562 హెల్ప్‌­లైన్‌ నంబరు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.

Advertisement
Advertisement