రేపు ఢిల్లీకి సీఎం వైఎస్‌ జగన్‌ | AP CM YS Jagan To Visit Delhi Tomorrow | Sakshi
Sakshi News home page

సీఎం వైఎస్‌ జగన్‌ ఢిల్లీ పర్యటన

Sep 21 2020 8:37 PM | Updated on Sep 21 2020 9:29 PM

AP CM YS Jagan To Visit Delhi Tomorrow - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ పర్యటన ఖారారైంది. మంగళవారం మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకోనున్న ఆయన, బుధవారం వరకు అక్కడే ఉండనున్నారు. రేపు రాత్రి ఢిల్లీలోనే బస చేసి, ఎల్లుండి ఉదయం తిరిగి తాడేపల్లికి చేరుకోనున్నారు.(చదవండి: ఈనెల 23న తిరుమలకు సీఎం వైఎస్‌ జగన్‌)

ఇదిలా ఉండగా.. ఈ నెల 23న సీఎం జగన్‌ తిరుమలను సందర్శించనున్నారు. విజయవాడ నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని, అనంతరం రోడ్డు మార్గం ద్వారా సాయంత్రం 5 గంటలకు తిరుమలలోని పద్మావతి గెస్ట్ హౌస్‌కు వెళతారు. గరుడ సేవ సందర్భంగా శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. అదే విధంగా 24న ఉదయం 8.10 గంటలకు కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్పతో కలిసి కర్ణాటక సత్రాల నూతన భవన నిర్మాణ భూమి పూజలో వైఎస్‌ జగన్ పాల్గొంటారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement