AP CM YS Jagan Extends Sankranti Wishes To Telugu People - Sakshi
Sakshi News home page

తెలుగు ప్రజలకు సీఎం వైఎస్‌ జగన్‌ సంక్రాంతి శుభాకాంక్షలు

Published Fri, Jan 13 2023 5:38 PM

AP CM YS Jagan extends Sankranti wishes to Telugu People - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ‘సంక్రాంతి పల్లెల పండుగ.. రైతుల పండుగ.. మన అక్కచెల్లెమ్మల పండుగ.. మొత్తంగా మన సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే అచ్చ తెలుగు పండుగ’ అని అన్నారు.

భోగి మంటలు, రంగ వల్లులు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు, గాలి పటాల సందళ్లు, పైరు పచ్చల కళకళలు గ్రామాల్లో సంక్రాంతి శోభను తీసుకువచ్చాయని చెప్పారు. భోగి.. సంక్రాంతి.. కనుమ పండుగలను ప్రతి గ్రామంలో ప్రతి కుటుంబం సంతోషంగా జరుపుకోవాలని అభిలషించారు.

రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి జీవితాల్లో ఈ మకర సంక్రాంతి మరింత ప్రగతితో కూడిన మార్పు తీసుకురావాలని, పండుగ సంబరాలతో తెలుగు లోగిళ్లలో, ప్రతి ఇంటా ఆనందాల సిరులు వెల్లి విరియాలని ఆకాంక్షించారు. 

చదవండి: (మీరు కలిసొచ్చినా రాజకీయంగా మరణమే: అంబటి రాంబాబు)

Advertisement
 
Advertisement