AP Assembly Session 2021: ఏపీ అసెంబ్లీ సోమవారానికి వాయిదా

AP Assembly Winter Session 2021 Second Day Live Updates - Sakshi

Time: 02:40 PM

ఏపీ అసెంబ్లీ సోమవారానికి వాయిదా పడింది.

Time: 01: 15 PM

► వ్యవసాయ రంగంపై సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. వర్షం వలన ఇబ్బందులపై చర్చలు జరుగుతున్నప్పుడు.. ప్రతి పక్షాలు కేవలం రాజకీయ కోణంలోనే ప్రవర్తించాయని సీఎం జగన్‌ విమర్శించారు. ప్రతి పక్షం అంటే.. సలహలు, సూచనలు ఇ‍వ్వాలని సీఎం జగన్‌ హితవు పలికారు. మనం ప్రజలకు మంచి చేస్తే.. మనకు జరుగుతుందని అన్నారు. 

Time : 01: 10 PM

► వ్యవసాయ రంగంపై ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి మాట్లాడుతూ.. సీఎం జగన్‌ పాదయాత్రలో ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తున్నారన్నారు. చంద్రబాబు కేవలం సింపతి కోసమే సభ నుంచి వెళ్లిపోయారని అబ్బయ్య చౌదరి పేర్కొన్నారు. 

Time: 01:05 PM

► వ్యవసాయ రంగంపై మంత్రి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ.. సాగునీటి కాల్వలను పూడికతీసి పునరుద్ధరించామని తెలిపారు. చివరి ఆయకట్టు భూమివరకు సాగునీరు అందేల చర్యలు తీసుకున్నామని చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి  పేర్కొన్నారు.

Time: 12: 55 PM

► వ్యవసాయ రంగంపై మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం.. రైతుల సంక్షేమం కోసం రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసిందన్నారు. కుప్పంలో ఓటమితో చంద్రబాబు.. మైండ్‌బ్లాక్‌ అయ్యిందని అన్నారు. టీడీపీ సభ్యులు.. ప్రీ ప్లాన్‌ ప్రకారం రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని కురసాల కన్నబాబు మండిపడ్డారు. 

Time: 12: 50 PM

► అసెంబ్లీ నుంచి చంద్రబాబు కావాలని వెళ్లిపోయారని కొడాలి నాని మండిపడ్డారు. చంద్రబాబు కేవలం సింపతి కోసం..  రాజకీయ వ్యభిచారం చేస్తున్నారని కొడాలి నాని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఏపీ ప్రజలు.. చంద్రబాబు.. మంగమ్మ శపథాలు పట్టించుకునే స్థితిలో లేరని అన్నారు. 

► చంద్రబాబు కావాలనే ప్లాన్‌ ప్రకారమే సభ నుంచి వెళ్లిపోయారని కొడాలి నాని తెలిపారు. చంద్రబాబు.. అందితే కాలు.. అందకపోతే జుట్టు పట్టుకుంటారని కొడాలని నాని మండిపడ్డారు. 

Time: 12: 45 Pm

► చంద్రబాబు వ్యాఖ్యలను, టీడీపీ సభ్యుల తీరును మంత్రి అప్పల రాజు ఖండించారు. చంద్రబాబు.. తల్లి గురించి, చెల్లి గురించి, చివరకు సీఎం సతీమణి ప్రస్తావన తెచ్చి సభలోని సభ్యులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని  మంత్రి అప్పలరాజు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

Time: 12: 35 PM

► వ్యవసాయరంగంపై చర్చలో భాగంగా ఎమ్మెల్యే అంబటి రాంబాబు మాట్లాడుతూ.. చంద్రబాబు కావాలని సభను, సభలోని సభ్యులను ఉద్దేశ పూర్వకంగా రెచ్చగొట్టారని అన్నారు. సభలో సాక్ష్యాత్తూ.. స్పీకర్‌ను పట్టుకుని రాజకీయ భిక్ష పెట్టడం వంటి మాటలతో రెచ్చగొట్టారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేవలం సానుభూతి కోసమే.. చంద్రబాబు సభ నుంచి వెళ్లిపోయారని మండిపడ్డారు. 

Time: 12: 25 PM

► వాయిదా అనంతరం అసెంబ్లీ సమావేశం ప్రారంభమైంది.. ఈ క్రమంలో.. పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్ససత్యనారాయణ మాట్లాడుతూ.. టీడీపీ నేతలు వ్యక్తిగత విషయాలు ప్రస్తావిస్తున్నారని ఎద్దేవా చేశారు. సభను కావాలని తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. కుటుంబ సభ్యుల ప్రస్తావన చంద్రబాబే తీసుకోచ్చారని.. బొత్స సత్యనారాయణ విమర్శించారు.

Time: 12: 10 PM

► చంద్రబాబు అసత్య ఆరోపణలపై..  మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ మండిపడ్డారు. చం​ద్రబాబు కావాలని సభ సమయాన్ని వృథా చేస్తున్నారని మంత్రి రాజేం‍ద్రనాథ్‌ విమర్శించారు. 

Time: 11: 25 AM

 టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్‌ తమ్మినేని సీతారాం.. తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ.. సభను సజావుగా సాగేలా చూడాలని టీడీపీ సభ్యులకు హితవు పలికారు. వ్యక్తిగత విమర్శలకు పోకుండా సంప్రదాయ బద్ధంగా సభ జరిగేలా చూడాలన్నారు. 

Time: 11: 20 AM

► టీడీపీ సభ్యులు సభను డైవర్ట్‌ చేస్తున్నారని మంత్రి కొడాలి నాని విమర్శించారు. చంద్రబాబు.. ఎన్టీఆర్‌ను వెన్నుపోటుపొడిచి పార్టీని లాక్కున్నారని కొడాలి నాని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

Time: 11: 15 AM

► వ్యవసాయ రంగంపై మంత్రి అప్పలరాజు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని డైరీలన్నింటినీ చంద్రబాబు పద్ధతి ప్రకారం నిర్వీర్యం చేశారని విమర్శించారు. ఆంధ్రా కంపెనీలు అక్కర్లేదా.. గుజరాత్‌ కంపెనీలు కావాలా? అని చంద్రబాబుని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం పాల ఉత్పత్తిదారుల మహిళా సంఘాలను బలోపేతం చేశాయని మంత్రి అప్పలరాజు పేర్కొన్నారు. 

Time: 11: 05 AM

► కురసాల కన్నబాబు వ్యవసాయ రంగంపై మాట్లాడుతుంటే.. టీడీపీ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు , టీడీపీ సభ్యులు సభను మరోసారి తీవ్ర అంతరాయం కల్గించారు. అనవసర విషయాలు మాట్లాడుతూ.. సభ సమయాన్ని వృథా చేశారు. 

Time: 10: 48 AM

► గత టీడీపీ ప్రభుత్వం ఏనాడూ పూర్తి ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వలేదని కురసాల కన్నబాబు గుర్తుచేశారు. రైతుల బాగు కోసం టీడీపీ నేతలు ఏనాడైనా ఒక్క సలహా ఇచ్చారా? అని కురసాల  కన్నబాబు ప్రశ్నించారు.  

Time: 10:00 AM
► వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ.. అమిత్‌ షా తిరుపతికి వస్తే రాళ్లు వేయించిన చంద్రబాబు.. అదే ఢిల్లీకి వెళ్లినప్పుడు ఆయన కాళ్లు పట్టుకున్నాడు. అసలు చంద్రబాబు గురించి మాట్లాడితే ఏడాది పాటు సభ పెట్టినా సరిపోదని విమర్శించారు.

Time: 9:50 AM

► వ్యవసాయ రంగంపై కురసాల కన్నాబాబు మాట్లాడుతున్నప్పుడు టీడీపీ సభ్యులు తీవ్ర అంతరాయం కల్గించారు.

Time: 9:15 AM

 ఏపీ అసెంబ్లీ  రెండో రోజు సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ.. వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చాక విస్తారంగా వానలు కురిశాయని తెలిపారు. చంద్రబాబు, కరువు కవల పిల్లలు అని కురసాల కన్నబాబు విమర్శించారు. 

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ రెండవ రోజు సమావేశాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ సమావేశాలను ఈ నెల 26 వరకు నిర్వహించాలని బీఏసీలో నిర్ణయించిన విషయం తెలిసిందే.  వ్యవసాయ రంగంపై చర్చ జరుగుతుంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top