‘మీ ఆఫీస్‌ ఎదుటే పెట్రోల్‌ పోసుకుని చనిపోతా’ | Another Video Released By Arava Sreedhar Victim | Sakshi
Sakshi News home page

‘మీ ఆఫీస్‌ ఎదుటే పెట్రోల్‌ పోసుకుని చనిపోతా’

Mar 27 2026 6:21 PM | Updated on Mar 27 2026 6:29 PM

Another Video Released By Arava Sreedhar Victim

విజయవాడ: జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ బాధితురాలు మరో వీడియో విడుదల చేశారు. ఇందులో తనకు జరిగిన అన్యాయంపై జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ను సూటిగా ప్రశ్నించారు.  తనకు అన్యాయం చేసిన అరవ శ్రీధర్‌ దర్జాగా పార్టీ కార్యక్రమాల్లో తిరుగుతున్నాడని, ఇక జనసేన పార్టీ విచారణ జరిపి ఏం లాభమని పవన్‌ కళ్యాణ్‌ను నిలదీశారు. జనసేన పార్టీ సమాజానికి ఏం సందేశం ఇవ్వాలనుకుంటుందన్నారు. 

తనకు అన్యాయం జరిగిందని గత మూడు నెలలుగా చెబుతూనే ఉన్నానని, త్రిసభ్య కమిటీ వచ్చి రెండు నెలలవుతున్నా అరవ శ్రీధర్‌పై ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. మీవైపు తప్పుంది కాబట్టే కమిటీ నివేదిక ఇవ్వడం లేదని, తనకు అన్యాయం చేయాలని చూస్తే జనసేన ఆఫీస్‌ ఎదుట పెట్రోల్‌ పోసుకుని చనిపోతానని హెచ్చరించారు. 

మీరంతా కలిసి నన్ను సక్సెస్ ఫుల్ గా మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘రేపు మీ కుటుంబాల్లో ఇలాగే జరిగితే.. మా పార్టీనే కదా అని ముడుచుకుని కూర్చుకుంటారా?,  మీ అమ్మాయిలపై అత్యాచారాలు జరిగినా సరే మీరు ఇలాగే వదిలేస్తారా? అని పవన్‌ను నిలదీశారు.

నేను ఆత్మహత్య చేసుకుంటా.. మరో సంచలన వీడియోతో ఆరవ శ్రీధర్ బాధితురాలు

Advertisement
 
Advertisement
Advertisement