ఆ పార్టీలకు ఓటేసినా ఉపయోగం లేదు: మంత్రి అనిల్‌ కుమార్‌

Anil Kumar Yadav Slams On TDP And CPI Over Housing Pattas Fake Propaganda - Sakshi

సాక్షి, నెల్లూరు: నెల్లూరు కార్పొరేషన్‌లో ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోంది. శుక్రవారం జలవనరుల శాఖ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ 54వ డివిజన్ అభ్యర్థి షఫియా బేగంతో కలిసి ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మంత్రి అనిల్‌కుమార్‌ మీడియాతో మాట్లాడుతూ.. ఇస్లాంపేట, భగత్‌సింగ్‌ కాలనీల్లో ఒక్క ఇల్లు కూడా తొలగించమని స్ప‍ష్టం చేశారు. టీడీపీ, సీపీఎం నేతల దుష్ప్రచారాలను నమ్మొద్దని అన్నారు. ఆ పార్టీలకు ఓటేసినా ఉపయోగం లేదని, ఆ విషయాన్ని టీడీపీ నేతలే చెబుతున్నారని ఎద్దేవా చేశారు.

చదవండి: ‘కుట్రలు, కుతంత్రాలు చేయడం చంద్రబాబుకి బాగా తెలుసు’

ఓటు చాలా విలువైనదని గుర్తుచేశారు. ప్రతి ఒక్కరికి ఇంటి పట్టాలు ఇచ్చే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పాలనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. కార్పొరేషన్‌లో 54 డివిజన్లు వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకోబోతోందని అన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top