వేతనాలు పెంచకుంటే రాష్ట్రవ్యాప్త ఆందోళన | Anganwadi workers and helpers stage protest | Sakshi
Sakshi News home page

వేతనాలు పెంచకుంటే రాష్ట్రవ్యాప్త ఆందోళన

Mar 31 2026 4:09 AM | Updated on Mar 31 2026 4:09 AM

Anganwadi workers and helpers stage protest

అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ అసోసియేషన్‌ 

సాక్షి, అమరావతి: అంగన్‌వాడీల వేతనాలు తక్షణమే పెంచాలని ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్ప­ర్స్‌ యూనియన్‌ డిమాండ్‌ చేసింది. ఈమేరకు సోమ­వారం సీఎం చంద్రబాబుకు రాసిన లేఖను అసోసి­యేషన్‌ అధ్యక్షురాలు జి.బేబీరాణి, ప్రధాన కార్య­దర్శి కె.సుబ్బరావమ్మ మీడియాకు విడుదల చేశారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 22 నెలలు దాటినా అంగన్‌వాడీల వేతనాలు పెంపు కోసం ఒక్కసారి కూడా మాట్లాడలేదన్నారు. గ్రా­ట్యూ­టీ జీవో ఇచ్చినా నేటికీ గైడ్‌లైన్స్‌ రూపొందించలేదన్నారు. మట్టిఖర్చుల జీవో కూడా అమలుకు నోచుకోవడంలేదన్నారు.

మార్చి 2న వేలాది మంది అంగన్‌వాడీలు విజయవాడలో చేపట్టిన నిరసనను పోలీసుల ప్రోద్భలంతో అణిచివేశారని, లైట్లు ఆపేసి, టెంట్లు పీకేసి వందలాది మంది మహిళలను ఈడ్చుకుంటూ జీపుల్లో తీసుకెళ్లారన్నారు. ఈ నిరసన సమయంలో కూడా మంత్రులు అంగన్‌వాడీ సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నా­మని చెప్పుకొచ్చారని, ఇప్పటికైనా ఇచి్చన హామీల అమలుకు చర్యలు తీసుకోవాలని లేకుంటే రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement