
సాక్షి, అమరావతి:
రాష్ట్రంలోని నిరుద్యోగులకు శుభవార్త. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 1,180 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) పంపిన ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఆర్థిక శాఖ గురువారం జీవో 49 విడుదల చేసింది. ఏపీపీఎస్సీ కార్యదర్శి పీఎస్సార్ ఆంజనేయులు 1,180 పోస్టుల భర్తీకి ఆమోదం కోరుతూ ఇటీవల ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. వీటితో పాటు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు(ఈబీసీ) 10 శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు వీలుగా సర్వీసు రూల్స్‌లో మార్పులు చేయాలని కోరారు. వీటిని పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వం పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టేందుకు గాను ఏపీపీఎస్సీకి అనుమతులిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
నోటిఫికేషన్ ఇవ్వనున్న పోస్టులు
పోస్టు సంఖ్య
మెడికల్ ఆఫీసర్(యునాని) 26
మెడికల్ ఆఫీసర్(హోమియోపతి) 53
మెడికల్ ఆఫీసర్ (ఆయుర్వేద) 72
లెక్చరర్(హోమియో) 24
లెక్చరర్(డాక్టర్ ఎన్‌ఆర్‌ఎస్‌జీఏసీ ఆయుష్) 3
జూ.అసిస్టెంట్, కంప్యూటర్ అసిస్టెంట్ 670
అసిస్టెంట్ ఇంజినీర్లు 190
ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ గ్రేడ్–3
(ఎండోమెంట్) 60
హార్టికల్చర్ ఆఫీసర్ 39
తెలుగు రిపోర్టర్(లెజిస్లేచర్) 5
డిస్ట్రిక్ట్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ 4
ఇంగ్లిష్ రిపోర్టర్(లెజిస్లేచర్) 10
జూనియర్ లెక్చరర్ ఏపీఆర్‌ఈఐ సొసైటీ 10
డిగ్రీ లెక్చరర్ ఏపీఆర్‌ఈఐ సొసైటీ 5
అసిస్టెంట్ కన్జర్వేటర్, ఫారెస్టు సర్వీస్ 9
మొత్తం 1,180