
సాక్షి, అమరావతి: కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం మరో ఘనత సాధించింది. మహిళలకు అత్యధిక డోసులు వేయడం ద్వారా దేశంలోనే టాప్‌లో నిలిచింది. బుధవారం సాయంత్రానికి ఏపీలో మొత్తం 3,85,14,395 డోసుల వ్యాక్సిన్ వేశారు. 1,24,98,073 మందికి రెండు డోసులు పూర్తయ్యాయి. 1,35,18,249 మందికి మొదటి డోస్ పూర్తయ్యింది. పురుషులకు 1,78,08,409 డోసులు, మహిళలకు 2,07,05,986 డోసులు వేశారు. దేశం మొత్తమ్మీద ఏపీతో పాటు కేరళ, పుదుచ్చేరిలో మాత్రమే మహిళలకు ఎక్కువ డోసులు వేయగలిగారు.
చదవండి: ఇళ్ల పట్టాల దరఖాస్తులను వెరిఫికేషన్ చేయాలి: సీఎం జగన్