మా స్థలాన్ని ఆక్రమించారు.. అనంత శ్రీరామ్‌ ఫిర్యాదు | Anantha Sriram Filed A Complaint To Collector Over Land Issues, More Details Inside | Sakshi
Sakshi News home page

మా స్థలాన్ని ఆక్రమించారు.. అనంత శ్రీరామ్‌ ఫిర్యాదు

May 25 2026 4:49 PM | Updated on May 25 2026 6:04 PM

Anantha Sriram Filed A Complaint To Collector Over Land Issues

భీమవరం(పశ్చిమగోదావరి జిల్లా): యలమంచిలి మండలం దొడ్డిపట్లలో తన ఇంటి ముందున్న ఐదు సెంట్ల ఉమ్మడి స్థలాన్ని ఆక్రమించారని జిల్లా కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదు చేశారు సినీ గేయ రచయిత అనంత్‌ శ్రీరామ్‌. ఈ మేరకు భీమవరం కలెక్టర్  కార్యాలయంలో  ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో అనంత్ శ్రీరామ్ ఫిర్యాదు చేశారు. 

స్థలం వివాదం కోర్టులో ఉన్నప్పటికీ పలువురు బెదిరింపులకు పాల్పడుతున్నారని అనంత్ శ్రీరామ్ ఫిర్యాదు చేశారు. తన తల్లిదండ్రులకు రక్షణ కల్పించాలని జిల్లా కలెక్టర్, ఎస్పీలకు అనంత్ శ్రీరామ్ వినతి పత్రం అందజేశామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement