ఏపీలో 20 లక్షలు దాటిన కరోనా పరీక్షలు | 20 Lakhs Corona Tests Completed In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ఏపీలో 20 లక్షలు దాటిన కరోనా పరీక్షలు

Aug 1 2020 5:52 PM | Updated on Aug 1 2020 6:48 PM

20 Lakhs Corona Tests Completed In Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో కరోనా నిర్ధారణ పరీక్షలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 60,797 మందికి పరీక్షలు నిర్వహించగా.. ఇప్పటివరకు నిర్వహించిన మొత్తం పరీక్షల సంఖ్య 20,12,573కి చేరింది. తాజాగా నిర్వహించిన టెస్టుల్లో 9276 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ కాగా.. 58 మంది వైరస్ ‌బారినపడి మృతిచెందారు. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,47,341కి చేరగా. మృతుల సంఖ్య 1407కి చేరింది. గత 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని 12,750 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో ఇప్పటివరకు డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 76,614కి పెరిగింది. ఏపీలో ప్రస్తుతం 72,188 యాక్టివ్ కేసులు ఉన్నాయి.


Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement