పులివెందులలో ఘోర రోడ్డు ప్రమాదం.. | 2 Women Workers Died In Road Accident At Pulivendula | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళా కూలీలు మృతి

Mar 31 2021 1:12 PM | Updated on Mar 31 2021 3:35 PM

2 Women Workers Died In Road Accident At Pulivendula - Sakshi

సాక్షి, వైఎస్సార్‌ కడప : పులివెందులలోని ముద్దనూరులో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జీపు, కారు, మున్సిపాలిటీ ట్రాక్టర్ ఒకదానికొకటి మూడు ఢీకొట్టడంతో ఇద్దరు మహిళ రైతు కూలీలు మృతి చెందారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మృతులంతా పులివెందుల మండలం ఇ.కొత్తపల్లె గ్రామస్థులుగా గుర్తించారు. తీవ్ర గాయాలైన వారు మున్సిపాలిటీ  పారిశుద్ధ్య కార్మికులు, రైతు కూలీలుగా గుర్తించామని పోలీసులు తెలిపారు. 

చదవండి: రోడ్డు ప్రమాదంలో యువ గాయకుడు మృతి

Advertisement
 
Advertisement
Advertisement