అనంతపురం టవర్‌క్లాక్: ఏపీ ఎన్జీఓ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న బకాయిలను తక్షణం విడుదల చేయాలని ఏపీ ఎన్జీఓ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రసాద్ యాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక ఎన్జీఓ హోంలో జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసాద్ యాదవ్ మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యయ, పెన్షనర్లకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న జీపీఎస్ ఏపీ జీఎల్‌ఐ, గ్రాడ్యుటీ, సరెండర్ లీవ్‌లకు సంబంధించిన బకాయిలు కొద్దిగా మాత్రమే విడుదల చేశారని, పెండింగ్‌లో ఉన్న బకాయిలు విడుదల చేసేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం జిల్లా నుంచి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎన్నికై న వెంకటేష్ బాబును ఘనంగా సన్మానించారు. జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీగా జిల్లా ఉపాధ్యక్షుడిగా ఉన్న శ్రీధర్‌బాబును ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు మాధవ్, రవికుమార్, జమీల బేగం, ప్రవీణ్ కుమార్, లక్ష్మీనారాయణ, దస్తగిరి, పద్మావతి, అనంతయ్య, మనోహర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఇంగ్లిష్ సబ్జెక్టు ఫోరమ్
కార్యవర్గం ఎన్నిక
అనంతపురం ఎడ్యుకేషన్: ఇంగ్లిష్ సబ్జెక్టు ఫోరమ్ జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఆదివారం స్థానిక కేఎస్‌ఆర్ బాలికల జూనియర్ కళాశాలలో ఆంగ్ల ఉపాధ్యాయులు సమావేశమయ్యారు. పలు అంశాలపై చర్చించారు. అనంతరం జిల్లా ఇంగ్లిష్ సబ్జెక్టు ఫోరమ్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా బోరంపల్లి నాగరాజు, ప్రధాన కార్యదర్శిగా డి. పుల్లయ్య, కోశాధికారిగా శివప్రసాద్ నాయుడుతో పాటు గౌరవాధ్యక్షుడిగా రామకృష్ణ, ఉపాధ్యక్షుడిగా ప్రసన్నలక్ష్మి, బసవరాజు, షమీవుల్లా, కార్యదర్శులుగా నటరాజు, రామ్మోహన్‌రెడ్డి, హరికృష్ణను ఎన్నుకున్నారు. సమావేశంలో ఫోరమ్ సీనియర్ ఉపాధ్యాయులు జయన్న, రంగస్వామి, నాగిరెడ్డి, నాగేంద్ర, సత్యప్రసాద్, సయ్యద్, మంజు, స్వర్ణలత, మంజునాథ్ పాల్గొన్నారు. కొత్త సిలబస్‌కు అనుగుణంగా ఉత్తమ బోధనా పద్ధతులను అమలు చేయడం లక్ష్యంగా పెట్టుకున్నామని వారు పేర్కొన్నారు.
గ్రామస్తుల దాడిలో
మతిస్థిమితం లేని వ్యక్తి మృతి
చిలమత్తూరు: మండల పరిధిలోని గాడ్రాళ్లపల్లికి చెందిన బావిరెడ్డి (51) అనే మతిస్థిమితం లేని వ్యక్తిపై గ్రామస్తులు దాడి చేయడంతో మృతి చెందాడు. పోలీసుల వివరాల మేరకు.. మృతుడు శనివారం రాత్రి వాహనాలపై రాళ్లతో దాడి చేసి అద్దాలు ధ్వంసం చేశాడని, మనుషులపై కూడా దాడి చేయడం, బట్టలు లేకుండా తిరగడం వంటి చర్యలతో గ్రామస్తులు ఆందోళనకు గురయ్యారన్నారు. ఆత్మ రక్షణలో భాగంగా గ్రామస్తులు బావిరెడ్డిపై దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడని పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ఆంజనేయులు తెలిపారు.


