పెద్ద కష్టం | - | Sakshi
Sakshi News home page

పెద్ద కష్టం

Apr 12 2026 2:42 AM | Updated on Apr 12 2026 2:42 AM

ఉమ్మడి జిల్లాకే పెద్దదిక్కుగా ఉన్న అనంతపురం సర్వజనాస్పత్రిలో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆస్పత్రి నిర్వహణ అధ్వానంగా మారింది. రోగులకు సకాలంలో వైద్యసేవలు అందడం లేదు. ఎటు చూసినా సమస్యలు రాజ్యమేలుతున్నాయి. చికిత్స కోసం వస్తున్న పేదలు సరైన వైద్యం అందక గగ్గోలు పెడుతున్నారు. బిల్లుల చెల్లింపులో ప్రభుత్వం ఉదాసీనంగా ఉండడంతో ప్రైవేటు ఆస్పత్రుల్లో ప్రస్తుతం ఆరోగ్యశ్రీ సేవలూ అందకుండా పోయాయి. దీంతో సర్వజనాస్పత్రికి వచ్చే రోగుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో వైద్యసేవలు మరింత అధ్వానంగా మారాయి.

– సాక్షి ఫొటోగ్రాఫర్‌, అనంతపురం

అందుబాటులో వీల్‌చైర్‌ లేక ఇబ్బంది పడుతున్న పేషెంట్‌

వీల్‌చైర్లలో ఖాళీ డబ్బాలు పెట్టుకుని పిచ్చాపాటి మాట్లాడుకుంటున్న సిబ్బంది

Advertisement
 
Advertisement
Advertisement