గార్లదిన్నె: రాష్ట్రాభివృద్ధి వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితోనే సాధ్యమని ఆ పార్టీ శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజానాథ్ అన్నారు. బుధవారం గార్లదిన్నె మండలం పెనకచెర్ల, పెనకచెర్ల డ్యాం, పి.కొత్తపల్లిలో నిర్వహించిన వైఎస్సార్‌సీపీ పల్లెబాట కార్యక్రమంలో ఆయన పాల్గొని, పార్టీ నాయకులు, కార్యకర్తలతో మాట్లాడారు. 2029లో అధికారాన్ని కై వసం చేసుకునేందుకు ఐక్యమత్యంతో గ్రామ స్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తే కార్యకర్తలకు వైఎస్ జగన్ తొలి ప్రాధాన్యతనిస్తారన్నారు. శింగనమల నియోజకవర్గంలో కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరిస్తామన్నారు. చంద్రబాబు ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాల కారణంగా భవిష్యత్తులో సాగు, తాగునీటి సమస్యలు తీవ్రమవుతాయని పేర్కొన్నారు. శ్రీకాకుళం నుంచి వర్షం నీటిని అనంతపురానికి తీసుకువస్తామంటూ సీఎం చంద్రబాబు పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. నీటి సమస్యపై ఉద్యమ కార్యాచరణ చేపట్టి ఆందోళనలు చేపడతామని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ ఎల్లారెడ్డి, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు నారాయణ రెడ్డి, లూర్దు ప్రకాష్ రెడ్డి, నియోజకవర్గ మేధావుల ఫోరం అధ్యక్షుడు అనిల్‌కుమార్ రెడ్డి, రైతు విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు పుల్లారెడ్డి, జంబులదిన్నె సొసైటీ మాజీ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, పెనకచెర్ల సర్పంచ్ బచ్చలన్న, పెనకచెర్ల డ్యాం గ్రామ అధ్యక్షుడు శ్రీనివాసులు, నాయకులు సుధాకర్‌రెడ్డి, చీమల శ్రీనివాసులు, ఆదినారాయణ, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.
కార్యకర్తలకు అండగా ఉంటా
శింగనమల: నియోజకవర్గంలోని ప్రతి వైఎస్సార్‌సీపీ కార్యకర్త, నాయకులకు అండగా ఉంటామని మాజీ మంత్రి, శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సాకే శైలజానాథ్ భరోసా కల్పించారు. బుధవారం శింగనమలలో వైఎస్సార్‌సీపీ పల్లెబాట కార్యక్రమాన్ని ప్రారంభించారు. వైఎస్సార్‌సీపీ గ్రామ అధ్యక్షుడు బెస్త గోపాలు అధ్యక్షతన నాయకులు, కార్యకర్తలతో శైలజానాథ్ సమావేశమై మాట్లాడారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబు ప్రభుత్వం పెడుతున్న ఇబ్బందులను పలువురు ఏకరవు పెట్టారు. దీంతో ప్రతి కార్యకర్తకూ అండగా ఉంటామని, ఏ సమస్య వచ్చినా కలిసికట్టుగా పోరాడుదామంటూ పిలుపునిచ్చారు. గ్రామ స్థాయి నుంచి పార్టీని మరింత అభివృద్ది చేసేందుకు యువత ముందుకు రావాలన్నారు. పార్టీ కోసం పనిచేసేవారికి వైఎస్సార్‌సీపీలో తగిన గుర్తింపు ఉంటుందన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత సంక్షేమ పథకాల లబ్ధిలో కార్యకర్తలకే తొలి ప్రాధాన్యత ఉంటుందన్నారు. సమావేశంలో శింగనమల, పుట్లూరు మండలాల వైఎస్సార్‌సీపీ కన్వీనర్లు పరంధామరెడ్డి, మహేశ్వరరెడ్డి, డీసీఎంఎస్ మాజీ డైరెక్టర్ బొమ్మన శ్రీరామిరెడ్డి, నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి, నాయకులు గొల్లారెడ్డి, బెస్త వెంకటనారాయణ, అంగజాల చంద్రశేఖర్, శివశంకర్‌రెడ్డి, మునేంద్ర, ఆలీ, అబ్దుల్లా, వెంకటప్ప, పర్వతయ్య, వడ్డే మల్లి, మహమ్మద్ హుస్సేన్, మనోజ్, నవీన్‌కుమార్, బెస్త ప్రసాద్, కులశేఖర్, వీరాంజనేయులు, సాయినాథ్, ఎల్‌వీ రమణ, దావుద్, నాగవర్థన్, జెల్లీ గోపీ , జెల్లీ శ్రీనివాసులు, ఎల్.రాజు తదితరులు పాల్గొన్నారు.
మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజానాథ్


