ఉరవకొండ: ఏబీఎన్–ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణపై పోలీసులు కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు వై.విశ్వేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక పార్టీ కార్యాలయంలో విలేకరులతో విశ్వేశ్వరరెడ్డి మాట్లాడారు. మహిళల గౌరవాన్ని దెబ్బతీసేలా రాధాకృష్ణ రాసిన రాతలు జర్నలిజం విలువలను పూర్తిగా దిగజార్చాయని మండిపడ్డారు. ఇలాంటి వాఖ్యలను ఆయన కుటుంబంపై చేస్తే సహిస్తారా అని ప్రశ్నించారు.రాధాకృష్ణపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపాదించిన మావిగన్‌కు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుండటాన్ని తట్టుకోలేకే ఎల్లో మీడియా డైవర్షన్ రాజకీయాలకు తెరలేపిందని దుయ్యబట్టారు. అసత్యాలు, అసభ్యకర కథనాలు ప్రచారం చేయడం ప్రజాస్వామ్యానికి హానికరమని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో మహిళల గౌరవం, భద్రత కోసం వైఎస్సార్‌సీపీ పోరాటం చేస్తోందన్నారు. రోత రాతలను ఖండిస్తూ మహిళా సంఘాలు, ప్రజాసంఘాలు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సీపీ వీరన్న, రాయలసీమ వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు బెస్త రమణ పాల్గొన్నారు.
జర్నలిజానికి రాధాకృష్ణ ఒక మాయని మచ్చ
వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు విశ్వేశ్వరరెడ్డి మండిపాటు


