ఎద్దుల బండిని ఢీకొన్న టాటా ఏస్‌ | - | Sakshi
Sakshi News home page

ఎద్దుల బండిని ఢీకొన్న టాటా ఏస్‌

Apr 8 2026 7:20 AM | Updated on Apr 8 2026 7:20 AM

ఇద్దరికి తీవ్ర గాయాలు

తాడిపత్రి రూరల్‌: మండలంలోని పెద్దపొలమడ–చిన్నపోలమడ మార్గంలో మంగళవారం తెల్లవారుజామున ఎద్దుల బండిని టాటా ఏస్‌ వాహనం ఢీకొంది. ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలు.. మండలంలోని బుగ్గకు చెందిన డ్రైవర్‌ వాసు, విజయ్‌ మహారాజ్‌లు పెద్దపప్పూరు మండలంలో జరిగిన చెక్క భజన కార్యక్రమానికి డీజే సామగ్రిని టాటా ఏస్‌లో తీసుకెళ్లారు. కార్యక్రమం ముగిసిన అనంతరం తిరిగి బుగ్గకు వెళుతూ పెద్దపొలమడ–చిన్నపోలమడ రోడ్డులో ముందు వెళుతున్న ఎద్దుల బండిని ఢీకొన్నారు. ప్రమాదంలో ఎద్దుల బండి పూర్తిగా దెబ్బతింది. బండి నడుపుతున్న గంగాధర్‌, టాటా ఏస్‌లో డ్రైవర్‌ పక్కన కూర్చున్న విజయ్‌మహారాజ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విజయ్‌మహారాజ్‌ పరిస్థితి ఆందోళన కరంగా ఉండటంతో అనంతపురం తీసుకెళ్లారు. ప్రమాదంలో రెండు ఎద్దులకు కూడా గాయాలయ్యాయి. నిద్రమత్తు కారణంగానే ప్రమాదం జరిగినట్లు తెలిసింది. ప్రమాదానికి కారణమైన టాటా ఏస్‌ మధ్యాహ్న సమయంలో కాలిపోవడం అను మానాలకు తావిచ్చింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

దెబ్బతిన్న ఎద్దుల బండి

కాలిపోయిన టాటా ఏస్‌

Advertisement
 
Advertisement
Advertisement